Anasuya Bharadwaj: కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకుని మాట్లాడండి..: అనసూయ ఫైర్

Anasuya Bharadwaj: పైగా ఇలా చెప్పినందుకు మీరు ఫీలై ఉంటే క్షమించండి అని చాలా డీసెంట్‌గా కామెంట్ చేశారు.

Update: 2022-01-27 08:59 GMT

Anasuya Bharadwaj: యాంకర్, నటి అనసూయ రిపబ్లిక్ డే సందర్భంగా అభిమానులతో ముచ్చటించారు. బుధవారం దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ గీతం వందేమాతరం ఆలపిస్తూ వీడియో షేర్ చేసింది. అది చూసి నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

మీరు పాడిన పాటేంటి.. సదర్భం ఏంటి.. ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం కాదు.. ఇంకా మీరు వేసుకున్న షర్ట్‌పై గాంధీ బొమ్మ ఉంది.. గాంధీకి, గణతంత్ర దినోత్సవానికీ అసలు సంబంధం ఉందా అని మరొకరు, కొంచెమైనా దేశభక్తి లేదు.. అలాంటి పాట నిల్చొని పాడాలని తెలియదా అని ఇంకొకరు..

ఇలా నెటిజన్లు ఓ రేంజ్‌లో అనసూయను ఆడుకున్నారు. పైగా ఇలా చెప్పినందుకు మీరు ఫీలై ఉంటే క్షమించండి అని చాలా డీసెంట్‌గా కామెంట్ చేశారు. దానికి అనసూయ కూడా అదే లెవల్లో రిప్లై ఇచ్చింది.. నా దేశం పట్ల నాకెంతో గౌరవం ఉంది..

స్వాతంత్ర్యం రాబట్టే గణతంత్ర దినోత్సవం వచ్చింది.. కాబట్టి కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకుని మాట్లాడండి అని ఘాటుగా సమాధానం ఇచ్చింది. అలాగే జాతీయ గీతం జనగణమణకు లేచి నిలబడి పాడతాం.. కానీ తాను పాడింది వందేమాతరం.. అది జాతీయ గేయం అని బదులిచ్చింది.. ఒకవేళ అందుకు ఎవరైనా ఫీలై ఉంటే క్షమించండి అంటూ నెటిజన్స్‌ ఆర్గ్యుమెంట్‌కి బ్రేక్ వేసింది.

Tags:    

Similar News