రివ్యూ : ఫంకీ
ఆర్టిస్ట్స్ : విశ్వక్ సేన్, కయాదు లోహర్, నరేష్ విజయకృష్ణ, సంపత్, ఈశ్వరీ రావు తదితరులు
ఎడిటర్ : నవీన్ నూలి
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ : సురేష్ సరంగం
నిర్మాతలు : నాగ వంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం : అనుదీప్ కె.వి
జాతిరత్నాలు ఫేమ్ అయ్యాడు దర్శకుడు అనుదీప్. ఆ వెంటనే చేసిన ప్రిన్స్ మాత్రం పోయింది. తర్వాత కాస్త టైమ్ ఎక్కువే తీసుకుని చేసిన మూవీ ఫంకీ. నాగవంశీ నిర్మించిన సినిమా ఇది. ప్రమోషన్స్ పరంగా బాగా అట్రాక్ట్ చేసింది. ట్రైలర్ చూస్తూనే ఇందులో పంచ్ లకు కొదవలేదు అనిపించింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
కోమల్(విశ్వక్ సేన్) తొలి మూవీకి దర్శకుడు. నాలుగు కోట్లతో సినిమా తీస్తే అని నిర్మాతను ఒప్పిస్తాడు. అప్పటికే నలభై కోట్లు అవుతుంది. అయినా మరో నాలుగు కోట్లు కావాలని అడుగుతాడు. ఆ మాటకు నిర్మాత (నరేష్) మూర్ఛపోతాడు. దీంతో ఆ నిర్మాత కూతురు చిత్ర (కయాదు లోహర్) ఎంటర్ అవుతుంది. కేవలం ఒక్క కోటిలో మూవీ తీస్తే అంటే ఒప్పుకుంటాం అంటుంది. అందుకు కోమల్ ఓకే చెబుతాడు. అలా మొదలైన ఈ జర్నీ ఎలా సాగింది.. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది.. అసలా మూవీ పూర్తి చేస్తారా లేదా అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
అనుదీప్ మూవీస్ అంటే ఇలాగే ఉండాలి అనే ముందే ఫిక్స్ చేశారు. ఆ రకంగానే కథనం అలాగే ఉండాలి అని ఫిక్స్ చేశారు. బట్ కథ విషయంలో మాత్రం చాలా తేలిపోయారు. అదేమంటే మేం ముందు నుంచీ కథ అంటూ లేదు కదా అని చెబుతున్నాం అన్నారు. ఆ కారణంగా ఈ పాయింట్ ను పట్టించుకోనక్కర్లేదు అనిపించారు. బట్ కథనంగా మాత్రం బాగా నవ్వించే ప్రయత్నం చేశారు. సింగిల్ లైన్స్ డైలాగ్స్ ను విపరీతంగా వాడుకున్నారు. ఆ డైలాగ్స్ లో కామెడీ పండిందా అంటే పండింది అంటాం.. పండలేదు అని కూడా అంటాం. అలా ఉంటుందీ సింగిల్ లైన్స్. అనుదీప్ తో పాటు మరో రచయిత కూడా ఉన్నాడు. బట్ వారి స్థాయికి తగ్గినట్టుగా రాశారు అనిపిస్తోంది. చాలా సన్నివేశాలు.. ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటాయి. ఎందుకు వచ్చాయి అంటే అదో స్టైల్ అనేలా ఉన్నారు. అలా మూవీ అంటే ఇలాగే తీయాలి అనే స్ట్రాటజీని వీళ్లు వదిలేసినట్టు కనిపిస్తారు. ఆ కారణంగా అలా వచ్చే సీన్స్ కొన్ని బాగా ఆకట్టుకుంటాయి.
ఇక ప్రధానంగా సినిమా అంతా హీరో, హీరోయిన్ చుట్టూ సాగుతుంది. కానీ చుట్టంతా ఉండేవాళ్లు చాలా అంటే చాలామందే ఉన్నారు. సినిమాలో ఓ సీన్ లో లాగా అతని రియల్ లైఫ్ లోని ఫ్రెండ్స్ అందరినీ గెట్ టు గెదర్ అన్నట్టుగా తీసుకుని వచ్చి వాడేసినట్టుగా ఉన్నారు. అంతమంది కనిపిస్తారీ మూవీలో. అయినా మాగ్జిమం స్క్రీన్ ప్రెజెన్స్ అంతా హీరోదే అవుతుంది. అదే మ్యాజిక్ అన్నట్టుగా ఉంటుంది. ఓ రకంగా ఈ మూవీ చాలా బావుంది అని చెప్పేలా ఉంది.. అదే టైమ్ లో అస్సలు బాలేదు అనేలానూ ఉంది. ఈ రెండు వెర్షన్స్ ను బట్టి మూవీ డిసైడ్ చేయడానికి లేదు. బాలేదు అన్నవాళ్లకే తర్వాత నచ్చేలా ఉంది. బావుంది అనే వాళ్లకే తర్వాత బాలేదు అనేలా ఉంది. డిఫరెంట్ రైటింగ్ అని చెప్పారు. బట్ ఇది జబర్దస్త్ కు కూడా తక్కువగా కనిపించండం మాత్రం విషాదమే అని చెప్పాలి.
నటన పరంగా చూస్తే విశ్వక్ సేన్ ఈ ‘డైలాగ్స్’ ను బాగా నమ్మినట్టు కనిపించాడు. అందుకు తగ్గట్టుగానే ప్రవర్తించాడు. అంతకు మించి నటించే అవకాశం మాత్రం రాలేదు. హీరోయిన్ కయాదు లోహర్ బానే ఉంది. డామినేటింగ్ నటన చూపించింది. నరేష్ కు ఇంకాస్త మంచి పాత్ర పడితే బావుండేది. ఈశ్వరి రావు.. తక్కువ సీన్స్ లో కనిపిచింది. సంపత్ పాత్ర కూడా బాగా లేదు. మిగిలిన పాత్రలన్నీ రొటీన్ గానే ఉన్నాయి.
టెక్నికల్ గా భీమ్స్ సంగీతం మైనస్ గా మారింది. పాటలు బాలేదు. నేపథ్య సంగీతం అంతంతమాత్రంగా ఉంది. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ ఓకే. డైలాగ్స్ బావున్నాయి.. కానీ సినిమా స్థాయికి తగ్గట్టుగా లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడు అనుదీప్ రైటింగ్ అస్సలు బాలేదు. తన ట్రెండ్ మార్చితే బావుంటుంది. లేదూ ఇలాంటి మూవీస్ తీయాలి అని అతను ఫిక్స్ అయితే అక్కడే ఉండిపోతాడు. ఫ్యూచర్ లో అయినా జానర్స్ మార్చాలి. లేదంటే చాలా త్వరగానే ఫేడవుట్ అవుతాడు.
ఫైనల్ గా : ఇంత ఫంకీ అంటే కష్టమే
రేటింగ్ : 2.5/5
బాబురావు. కామళ్ల