Anchor Lasya: యాంకర్ లాస్యకు ఏమైంది.. హాస్పిటల్ బెడ్‌పై..
Anchor Lasya: బుల్లితెరపై యాంకర్‌గా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా సందడి చేసిన లాస్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది.;
Anchor Lasya: బుల్లితెరపై యాంకర్‌గా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా సందడి చేసిన లాస్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఆ విషయం స్వయంగా ఆమె భర్త మంజునాథ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశారు.ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వీడియోలో, లాస్య ఆసుపత్రి బెడ్‌పై పడుకుని చికిత్స పొందుతున్నట్లు కనిపించింది. ఆమెను ఎందుకు ఆసుపత్రిలో చేర్చారనేది కారణం అతను వెల్లడించలేదు.
ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.. బిగ్ బాస్ జర్నీలో యాంకర్ లాస్యకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆమెకు కొడుకు జున్ను అంటే ఎంత ఇష్టమో హౌస్‌లో ఉన్నన్ని రోజులు అందరికీ చెప్పి ఆనందించేది.