Anchor Pradeep: ప్రదీప్ పెళ్లి.. ఎవరిని చేసుకుంటున్నాడంటే..
Anchor Pradeep: బుల్లితెర బ్యాచులర్ ప్రదీప్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడట. అతడి పెళ్లి ఇప్పటికే చాలా సార్లు వార్తల్లోకి వచ్చింది.;
Anchor Pradeep: బుల్లితెర బ్యాచులర్ ప్రదీప్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడట. అతడి పెళ్లి ఇప్పటికే చాలా సార్లు వార్తల్లోకి వచ్చింది. కానీ అవన్నీ తూచ్. నేనింకా బ్యాచులర్ లైఫ్‌ని పూర్తిగా ఎంజాయ్ చేయలేదంటూ పెళ్లి ప్రస్తావని దాటవేస్తూ వస్తున్నాడు ప్రదీప్.
తాజాగా మళ్లీ ఓ వార్త చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో. టాలీవుడ్‌లో టాప్ మేల్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ అడపా దడపా అవకాశాలు వస్తే సినిమాల్లో కూడా కనిపిస్తుంటాడు. ప్రదీప్ యాంకరింగ్ నొప్పించక, తానొవ్వక అన్నట్లు కామెడీ కిక్కిస్తుంటాయి ఆడియన్స్‌కి. ప్రదీప్ గత కొంత కాలంగా నవ్య మారోతుతో ప్రేమాయణం నడిపిస్తున్నట్లు టాక్.
ఇరుకుటుంబాల సభ్యులు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ముహూర్తం ఖరారు అని వార్తలు వస్తున్నాయి. కాగా, నవ్య మారోతు ఫ్యాషన్ డిజైనర్‌గా మంచి పేరు తెచ్చుకుంది.
బుల్లి తెర, సోషల్ మీడియా సెలబ్రెటీలకు డ్రెస్‌లు డిజైన్ చేస్తుందట. ముఖ్యంగా బిగ్ బాస్ రియాల్టీ షోలో వస్తు్న్న కంటెస్టెంట్లకు నవ్యనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తుందట. మరి ప్రదీప్-నవ్య పెళ్లి వార్త ఎంత వరకు నిజమో తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే.