అక్కినేని నాగార్జున.. కెరీర్ మొదలుపెట్టి నాలుగు దశాబ్దాలు దాటుతోంది. కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశాడు. ఎంతోమంది కొత్త టెక్నీషియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. స్టార్ హీరోగానే కాదు.. స్టార్ బిజినెస్ మేన్ గానూ రాణిస్తున్నాడు. ఆ తరంలోని ఆ నలుగురు హీరోల్లో నాగ్ కు స్టైలిష్, మోస్ట్ హ్యాండ్సమ్ అన్న పేరుంది. ఆ ఇమేజ్ ను దాటే అన్నమయ్య, రామదాసు వంటి మూవీస్ తో పరిశ్రమనే కాక ప్రేక్షకులనూ సర్ ప్రైజ్ చేశాడు. అయితే ఇన్నేళ్ల కెరీర్ లో నాగార్జున నుంచి చాలా అంటే చాలా తక్కువసార్లే ‘ఇండస్ట్రీ హిట్’ అనదగ్గ మూవీస్ ఉన్నాయి. ప్రస్తుతం వందో సినిమాకు దగ్గరగా ఉన్నాడు. కొన్నాళ్లుగా యాక్షన్ మూవీస్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ప్రస్తుతం కుబేరతో పాటు తమిళ్ లో కూలీ అనే మూవీలో నటిస్తున్నాడు నాగ్. అయితే తనతరం హీరోలతో పోలిస్తే ఓ విషయంలో నాగ్ పూర్తిగా వెనకబడిపోయాడు. ఇప్పుడు ఆయన కెరీర్ గ్రాఫ్ ను చూస్తే తిరిగి ఫామ్ లోకి వస్తాడు అనే గ్యారెంటీ కూడా కనిపించడం లేదు. కుబేర, కూలీ రెండు సినిమాల్లోనూ తను మెయిన్ హీరో కాదు.
ఇక అసలు విషయం ఏంటంటే.. తనతరం హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంద కోట్ల క్లబ్ లో ఎప్పుడో చేరారు. బట్ నాగ్ మాత్రం ఆ దరిదాపుల్లో కూడా లేడు. ఊపిరి 53 కోట్లతో సోగ్గాడే చిన్ని నాయనా 47 కోట్ల షేర్ తో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. అంటే వంద కోట్లు అనేమాట ఆయన కెరీర్ లో ఇంకా వినిపించలేదు. నాగార్జున హీరోగా వందో సినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలనే ప్రయత్నాల్లో భాగంగా రకరకాల కథలు వింటున్నాడు.. దర్శకులను ప్రయత్నిస్తున్నాడు. కానీ అవేవీ వర్కవుట్ కావడం లేదు. ఒకవేళ వర్కవుట్ అయ్యి.. మళ్లీ ఇండస్ట్రీ హిట్ లాంటి టాక్ వస్తే అప్పుడు నాగ్ కూడా 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవుతాడేమో కానీ.. చూస్తుంటే అదిప్పట్లో సాధ్యం అయ్యేలా మాత్రం లేదనిపిస్తోందనేది మెజారిటీ పీపుల్ ఒపీనియన్.