యంగ్ బ్యూటీ అనిఖా సురేంద్రన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో పలు చిత్రాలు చేసింది. ‘బుట్టబొమ్మ'తో హీరోయిన్ గా మారిన అనిఖా.. ఆ తర్వాత 'హో మై డార్లింగ్', 'ది ఘోస్ట్', 'జాబిలమ్మ నీకు అంత కోపమా’ చిత్రాలతో ఆకట్టుకుంది. తనదైన నటన, అందం, అభినయంతో ఆడియన్స్ ను మెప్పించింది. 2013లో మలయాళ చిత్రం '5 సుందరికల్'లో 'సేతు లక్ష్మి' పాత్రకు గాను ఆమె ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు. మరోవైపు ఈ చిన్నది సోషల్ మీడియాలో నూ ఫుల్యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ ఫొటోషూట్ లో పాల్గొంటూ వాటిని ఇన్స్టాలో షేర్చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఊటీ ప్రకృతి అందాల మధ్య చిలుకపచ్చ చీరలో క్యూట్ పోజులతో కుర్రాళ్ల మనసులు దోచేస్తోంది. ఈ ఫొటోలకు 'కెమెరా ముందు మల్లు అమ్మాయిలా నటిస్తూ.. వెనుక వణుకుతోంది. ఊటీ చాలా చల్లగా ఉంది' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ అనిఖా గ్లామర్ కు ఫిదా అవుతున్నారు. చిలక పచ్చ చీరలో ఎంతముద్దుగా ఉన్నాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.