Nayantara : నయనతారతో కలిసి రఫ్పాడించావ్ అనిల్

Update: 2025-05-17 08:23 GMT

అనిల్ రావిపూడి స్టైల్ రోజు రోజుకూ మారుతోంది. ప్రమోషన్స్ తో ఇండస్ట్రీకే కొత్త రూట్ వేశాడు అనిల్. సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ చూసిన తర్వాత అందరూ అతన్నే ఫాలో అవుతున్నారు. ఆ రేంజ్ లో కొత్తదనం చూపించాడు. ప్రమోషన్ కు కాదేదీ అనర్హం అనేలా చేశాడు. ప్రతి ఒక్కరినీ ఫుల్లుగా వాడేసుకున్నాడు కూడా. ఇక ఇప్పుడు ‘ఇంటర్ డ్యూస్’లో కూడా కొత్త ట్రెండ్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం మెగాస్టార్ తో సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ ఓపెనింగ్ రోజూ అంతా తన గురించే మాట్లాడుకునేలా చేశాడు. ఇక ఇప్పుడు నయనతార వంతు వచ్చింది. యస్.. ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. ఈ విషయాన్ని మామూలుగా అయితే ఓ ఫోటోతో చెప్పేస్తారు చాలామంది. బట్ అనిల్ కదా.. నయన్ పరిచయాన్ని రఫ్పాడించేలా చూపించాడు.

కేరవాన్ లో నయన్ రెడీ అవుతూ తెలుగులో మాట్లాడుతుంది. హెయిర్ డ్రెస్సర్ అడుగుతుంది. తెలుగులో మాట్లాడుతున్నారు.. తెలుగు సినిమా చేస్తున్నారా అని.. తను అవును అంటుంది. కార్ లో వెళుతుండగా... స్టార్ స్టార్ మెగాస్టార్ అనే పాట వస్తుంటుంది. అప్పుడు నయన్.. డ్రైవర్ తో ‘అన్నా మెగాస్టార్ గారి పాటా.. సౌండ్ పెంచు.’ అంటుంది. తర్వాత స్క్రిప్ట్ చదువుతూ నవ్వుతూ.. వెరీ ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ అంటుంది. చివర్ లో హలో మాస్టారూ.. కెమెరా కొంచెం రైట్ టర్నింగ్ ఇప్పించుకోండి అంటుంది. అప్పుడు అనిల్ రావిపూడి ఎంట్రీ. అనిల్.. ఘరానా మొగుడులో చిరంజీవిలా వంగి నమస్కారం చేస్తూ.. సంక్రాంతికి.. అంటే.. నయన్ కూడా అదే స్టైల్ లో రఫ్ఫాడించేద్దాం అంటుంది.

సింపుల్ గా అదిరిపోయేలా ఉందీ పరిచయం. ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ తోనే ఆడియన్స్ ను తనవైపు తిప్పుకుంటున్నాడు. విశేషం ఏంటంటే.. సినిమాల్లోనే కాదు.. ఇలాంటి ఫీట్స్ లోనూ వినోదం ఉండేలా చూసుకుంటున్నాడు అనిల్. ఏదేమైనా నయనతార పరిచయ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ.. రఫ్ఫాడించావ్ నయన్ అనేస్తున్నారు. 

Tags:    

Similar News