టాలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలెక్కనుంది. కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్ ఓ ఇంటివాడు కానున్నాడు. నటి చాందినీ రావును ఆయన ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 11న వీరి ఎంగేజ్మెంట్ వైజాగ్ లో జరగనుందని, డిసెంబర్ 7న తిరుపతిలో పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది. కాగా చాందినీ రావు కలర్ ఫొటో, రణస్థలి వంటి చిత్రాలతో పాటు హేడ్స్ అండ్ టేల్స్ వెబ్ సిరీస్లో నటించారు. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి దర్శకుడిగా మారాడు సందీప్ రాజ్. ఆయన తెరకెక్కించిన కలర్ ఫోటో ఎంత పెద్ద విజయాన్ని సాదించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెన్సిబుల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా నేషనల్ అవార్డు సాధించింది. ప్రస్తుతం సందీప్ రాజ్ రోషన్ కనకాలతో మోగ్లీ సినిమా చేస్తున్నాడు.