ప్రేమమ్ సినిమాతో 2015లో తెరంగేట్రం చేసిన భామ అనుపమ పరమేశ్వరన్. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఫస్ట్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వచ్చాయి. 'అ ఆ'లో వల్లి పాత్రలో నటించి తెలుగు ఆడియన్స్కు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'శతమానం భవతి'లో పదహారణాల తెలుగమ్మాయిలా అటు యూత్ ఇటు ఫ్యామిలీ ఆడియన్స్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ టైంలో వరుస మూవీస్తో మెప్పించింది. డీజే టిల్లు సినిమాలో గ్లామర్ రసం పెంచేసిందీ అమ్మడు. ప్ర స్తుతం సినిమాలతోపాటు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటోందీ భామ. తాజాగా అనుపమ పరమేశ్వరన్ ట్రెడిషనల్ శారీలో ఫోటోస్ షేర్ చేయగా అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. మె స్మరైజింగ్ లుక్స్ సిగ్గు ఒలకబో స్తూ ఫ్యాన్స్ మనసు దోచేశారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో యంగ్ హీరోస్తో జత కట్టిన అనుపమ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీ 'పరదా'లో నటిస్తోంది. దీంతో పాటే మలయాళంలో'జానకివర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'లో నటించారు. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ నిరాకరించడం హాట్ టాపిక్ గా మారింది.