అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఘాటీ సినిమా ఈ నెల 5న విడుదల కాబోతోంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఘాటీపై ఇప్పటి వరకూ పెద్దగా అంచనాలు లేవు అనే చెప్పాలి. అనుష్క సరసన తమిళ నటుడు విక్రమ్ ప్రభు నటించాడు. ఆంధ్రా ఒరిస్సా బార్డర్ లో జరిగే కథ అని ముందే చెప్పారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కు అనుష్క రావడం లేదు. కారణాలేంటీ అని చెప్పలేదు. అయితే తాజాగా తన సినిమా గురించిన విశేషాలను నటుడు రానాతో ఫోన్ లో పంచుకుంది. దీన్నో ప్రమోషనల్ ‘ఆడియో’గా విడుదల చేశారు మేకర్స్.
క్రిష్ అంటే రానాకు అభిమానం. ఈ ఇద్దరి కాంబోలో కృష్ణంవందే జగద్గురుం వచ్చింది. అటు అనుష్క కూడా రానాను అన్న అని పిలుస్తుంది. సో.. ఆమె ప్రమోషన్స్ కు డైరెక్ట్ గా రావడం లేదు కాబట్టి క్రిష్ ఇలా ప్రమోషన్ ప్లాన్ చేశాడు. ఈ ఆడియోలో రానాతో తన సినిమా గురించిన కబుర్లు, హైలెట్స్ గురించి చెబుతోంది అనుష్క. అలాగే ఇలాంటి సినిమా చేయాలంటే ఏ మేకర్ కు అయినా నువ్వు తప్ప వేరే ఆప్షన్ లేదు అని రానా చెప్పడంతో అనుష్క సిగ్గు పడుతూ నవ్వుతూ వినిపించింది. ఈ మూవీలో చాలా వయొలెన్స్ ఉందని.. శీలావతి(అనుష్క), దేశిరాజు(విక్రమ్ ప్రభు) ల జర్నీ బావుంటుందని చెప్పింది. మొదట దొంగతనాలు చేసి, తర్వాత వాటిని ఎదురించి లెజెండ్ గా మారిన ఓ లేడీ కథే ఇది అంటూ అనుష్క చెప్పుకొచ్చింది
మొత్తంగా క్రిష్ ఆడియో ప్రమోషన్ ఐడియా బావుంది. బట్ తనుగా అనుష్క వచ్చి ఇదే రానాతో ఇంటర్వ్యూ అయినా చేసి ఉంటే రీచ్ ఇంకా వేరే లెవల్ లో ఉండేదేమో.