Anushka Ghaati : అనుష్క ఘాటీ రిలీజ్ డేట్ అప్డేట్

Update: 2025-08-05 11:00 GMT

ఒకప్పుడు అనుష్క శెట్టి మూవీ అంటే ఆడియన్స్ లో ఓ క్రేజ్ ఉంది. మెల్లగా ఆ క్రేజ్ తగ్గుతోంది. తన నుంచి సినిమాలు వచ్చేదే ఎప్పుడో ఓ సారి అంటే అవి కూడా బాగా ఆలస్యం అవుతున్నాయి. చివరగా లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో కనిపించింది. ఈ యేడాది ఘాటీతో వస్తుందనుకున్నారు. సమ్మర్ లోనే విడుదల కావాల్సిన ఈ మూవీ బాగా లేట్ అయింది. ఇప్పటికే రకరకాల రిలీజ్ డేట్ లు అనౌన్స్ కావడం ఆపై పోస్ట్ పోన్ అని చెప్పడం కామన్ అయిపోయింది. అందుకే ఘాటీ పై మినిమం బజ్ కూడా లేదు.

దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న సినిమా ఇది. వీరి కాంబోలో వేదం మూవీ తర్వాత వస్తోన్న సినిమా. అనుష్క సరసన విక్రమ్ ప్రభు మేల్ లీడ్ లో కనిపించబోతున్నాడు. ఇతర కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, చైతన్య రావు, జగపతి బాబు, రవింద్ర విజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ ను ఈ బుధవారం విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా చెప్పబోతున్నాం అని ప్రకటించింది టీమ్. అయినా పెద్దగా సందడి కనిపించకపోవడం విశేషం. అదే.. తను రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ ఉంటే ఇంత డల్ గా ఉండేది కాదేమో. ఏదేమైనా ఇప్పుడు స్టార్డమ్ కంటే కంటెంట్ ఎక్కువగా మాట్లాడుతోంది. అందుకే ఘాటీకి హిట్ టాక్ వస్తే సూపర్ హిట్ అయిపోతుందంతే. మరి ఈ ట్రైలర్ తో అయినా బజ్ క్రియేట్ అవుతుందేమో చూడాలి. 

Tags:    

Similar News