Anushka Sharma: అనుష్క శర్మ ఆహారపు అలవాట్లు.. సాయింత్రం 6గంటలకల్లా..
Anushka Sharma: అందాల నటి అనుష్క శర్మ సాయంత్రం 6 గంటలకల్లా డిన్నర్ కంప్లీట్ చేస్తే డయాబెటిస్‌ను నియంత్రించొచ్చని చెబుతోంది.;
Anushka Sharma: అందాల నటి అనుష్క శర్మ సాయంత్రం 6 గంటలకల్లా డిన్నర్ కంప్లీట్ చేస్తే డయాబెటిస్‌ను నియంత్రించొచ్చని చెబుతోంది. ఈ అలవాటు మీ శరీరంలో పేరుకున్న కేలరీలను బర్న్ చేయగలదని, బరువు తగ్గడంలో సహాయపడగలదని తెలిపింది. తనకు, తన భర్త విరాట్ కోహ్లీకి రాత్రి భోజనం త్వరగా ముగించడం, త్వరగా నిద్ర పోవడం అలవాటని పేర్కొంది. ఒకసారి విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ విందుకు ఆహ్వానించినప్పుడు కూడా 6గంటలకల్లా డిన్నర్ చేస్తానని చెప్పా.. దానికి వారు కూడా అదే విధంగా అరేంజ్ చేశారు. నటుడు అక్షయ్ కుమార్ కూడా రాత్రి భోజనాన్ని త్వరగా పూర్తి చేస్తారు. చాలా మంది సెలబ్రెటీలు వారి వృత్తిలో రాణిస్తున్నారంటే వారి ఆహారపు అలవాట్లు ప్రధాన కారణంగా ఉంటాయి.
మీ శరీరానికి ఎర్లీ డిన్నర్ ఎందుకు అవసరమో నిపుణులు తెలియజేస్తున్నారు. శరీర జీవక్రియ సాధారణంగా మధ్యాహ్నం నుండి సాయింత్రం వరకు గరిష్టంగా ఉంటుంది. అందుకే మీ భోజనాన్ని త్వరగా ముగించాలి. ఆలస్యంగా తినడం వల్ల మీ ఆకలి బాధ రెట్టింపు అవుతుంది. అంటే మీరు ఎక్కువగా తినాల్సి వస్తుంది. దాంతో బరువు పెరుగుతారు. నిద్ర లేచిన రెండు గంటలలోపు బ్రేక్‌ఫాస్ట్, నిద్రకు కనీసం రెండు, మూడు గంటల ముందు రాత్రి భోజనం చేయడం అనేది మంచి ఆలోచన. శరీరంలోని హార్మోన్లు, ముఖ్యంగా ఇన్సులిన్ విశ్రాంతి తీసుకోవాలి. ఇది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరించడానికి సమర్ధవంతంగా పని చేస్తుంది.
ఆలస్యంగా తినేటట్లయితే, మీ రాత్రి భోజనాన్ని తేలికగా ఉండేలా చూసుకోండి. కార్బోహైడ్రేట్‌లను తగ్గించండి. భోజనం తర్వాత ఏదో ఒక విధమైన శారీరక శ్రమలో మునిగిపోండి. అది ఐదు నిమిషాల నడక లేదా మెట్లు ఎక్కడం వంటివి చేయండి. ఒక వ్యక్తి యొక్క జీవనశైలి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. మూడు పూటలా భోజనం చేయడం వల్ల తృప్తి కలుగుతుంది, ఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. చేస్తున్న పనిపైన ఏకాగ్రత పెరుగుతుంది.