Khatija Rahman : పెళ్లి చేసుకున్న ఏఆర్‌ రెహమాన్‌ కూతురు.. అల్లుడు ఎవరంటే...!

Khatija Rahman : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూతురు ఖతీజా రెహమాన్ పెళ్లి చేసుకుంది.

Update: 2022-05-06 09:00 GMT

Khatija Rahman : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూతురు ఖతీజా రెహమాన్ పెళ్లి చేసుకుంది. ఆడియో ఇంజనీర్, బిజినెస్ మెన్ రియాస్దీన్ షేక్ మహమ్మద్‌ తో మే 5న ఆమె వివాహం జరిగింది. ఈ వివాహానికి వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. వివాహానికి సంబంధించిన ఫోటోలను రెహమాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా వీరికి గతేడాది డిసెంబర్ లో నిచ్చితార్ధం అయింది. ఈ ఫోటోలలో రియాస్దీన్ తెల్లటి షేర్వానీలో కనిపించగా, ఖతీజా ప్రింటెడ్ ఆఫ్-వైట్ దుస్తుల్లో కనిపిస్తున్నారు. దీంతో పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 


Tags:    

Similar News