KAMAL: కోర్టు ఆదేశించినా వెనక్కి తగ్గని కమల్‌హాసన్
క్షమాపణలు చెప్పాలని కోర్టు ఆదేశం... కర్నాటకలో సినిమా విడుదల చేయబోమని స్పష్టీకరణ;
మక్కల్ నీది మయ్యం అధినేత, విశ్వ నటుడు కమల్ హాసన్ చుట్టూ ప్రస్తుతం భాషా వివాదం నడుస్తోంది. తమిళం కన్నడ నుంచి పుట్టిందనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కమల్‌కు కర్ణాటక హైకోర్టు సూచించింది. కమల్ హాసన్.. వాక్ స్వాతంత్య్ర హక్కును దుర్వినియోగం చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీయకూడదని కర్ణాటక హైకోర్టు హెచ్చరించింది. కన్నడ భాష "తమిళం నుంచి పుట్టింది" అనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయనను కోరింది. "మీరు సాధారణ వ్యక్తి కాదు" అని కోర్టు కమల్ హాసన్ గురించి వ్యాఖ్యానించింది. "మీకు మాట్లాడే హక్కు ఉంది... కానీ మనోభావాలను దెబ్బతీయకూడదు. వాక్ స్వాతంత్ర్యపు హక్కు.. భావ వ్యక్తీకరణ హక్కును ప్రజల మనోభావాలు తీసేందుకు వినియోగించుకోవద్దు. మేము దీన్ని మీకే వదిలేస్తున్నాం.. మీరు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించమని అడగండి" అని కోర్టు పేర్కొంది. "ఈ సందర్భంలో మీరు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనను ఉపసంహరించుకోండి... అంతే. కర్ణాటక నుంచి కోట్లు సంపాదించవచ్చు... కానీ మీకు కన్నడ ప్రజలు అవసరం లేకపోతే ఆదాయాన్ని వదిలివేయండి..." అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: కమల్ హాసన్
ఉలగ నాయగన్ కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ‘థగ్‌లైఫ్’ సినిమాను విడుదల చేయడం లేదని ఆయన వెల్లడించారు. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని మరోసారి తేల్చి చెప్పారు. కోర్టు క్షమాపణలు చెప్పాలని సూచించినా ఆయన వెన్కకి తగ్గలేదు.\
కర్ణాటకలో సినిమా రిలీజ్ చేయం: కమల్ హాసన్
తాను చేసిన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవి అని ... అందువల్ల తాను క్షమాపణలు చెప్పబోనని కమల్ హాసన్ మరోసారి స్పష్టం చేశారు. అంతేకాకుండా తన సినిమాను కర్ణాటక విడుదల చేసే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. దీనిపై పలువురు మాట్లాడుతూ... ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేస్తే కోటి నుంచి 5 కోట్లు వస్తాయని.. వీటి కోసం తాను క్షమాపణ చెప్పనని కమల్ భీష్మించుకుని కుర్చూన్నారని అంటున్నారు. కమల్ ఈ సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తూ క్షమాపణ చెప్పనని తేల్చి చెప్పారు. కానీ భవిష్యత్తు ఇంకా సినిమాలు చేస్తారు కదా మరి వాటిని కూడా కర్ణాటకలో విడుదల చేయకపోతే అనేక కోట్లు నష్టం వస్తుంది కదా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎదేమైనా కమల్ ఒక్క క్షమాపణ చెబితే ఇంత కథ జరిగేది కాదని అంటున్నారు.