రివ్యూ : మృత్యుంజయ్
ఆర్టిస్ట్స్ : శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప పి శర్మ, తదితరులు
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
సంగీతం : కాల భైరవ
సినిమాటోగ్రఫీ : విద్యా సాగర్ చింత
నిర్మాతలు : సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి
దర్శకుడు : శ్రీ హుస్సేన్ షా కిరణ్
ఈ మధ్య కాలంలో శ్రీ విష్ణు అన్నీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్స్ తోనే వస్తున్నాడు. నిజానికి అతను కెరీర్ మొదలు పెట్టిన టైమ్ లో అన్నీ సిరియస్ మూవీస్ మాత్రమే చేశాడు. మెల్లగా వినోదాత్మక కథలతో మెప్పించడం మొదలు పెట్టాడు. మళ్లీ ఇన్నాళ్లకి అతను ఓ సీరియస్ మూవీతో వస్తున్నట్టు కనిపించాడు. ఆ మూవీ మృత్యుంజయ్. కంప్లీట్ గా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథ అని ప్రమోషన్స్ లోనే చెప్పారు. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం.
కథ :
జై (శ్రీ విష్ణు) ఓ పత్రికలో యాడ్స్ చేయించే ఉద్యోగం చేస్తుంటాడు. అతనికి ఎప్పుడైనా క్రైమ్ రిపోర్టర్ కావాలనే ఉంటుంది. అందుకోసం ప్రయత్నాలు కూడా చేస్తుంటాడు. అయితే యాడ్స్ విషయంలో మాత్రం అతను ఎక్కువగా చనిపోయిన వారికి శ్రద్ధాంజలి యాడ్స్ కోసం చూస్తుంటాడు. ఈ ప్రయత్నంలో ఓ సారి చనిపోయిన ఓ వ్యక్తి కూతురుని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ పాప అస్సలు ఏడవదు. తన తండ్రికి అసలు ఏం జరిగింది అనే కోణంలోనే ఆలోచిస్తుంటాడు. అదే టైమ్ లో మరో మనిషి కూడా చనిపోతాడు. దీంతో జై ఈ మరణాల వెనక మర్డర్స్ కూడా ఉన్నాయి అనే అనుమానం వస్తుంది. ఆ ఇద్దరు వ్యక్తుల మరణం వెనక ఉన్నది ఎవరో తెలుసుకుంటాడు. అయితే కేవలం అతని పోలికలు మాత్రమే తెలుస్తాయి. దీంతో పోలీస్ అధికారి అయిన సీత(రెబా మోనికా జాన్)ను కలుస్తాడు. ఆమె కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆమె అతన్ని నమ్మదు. మరి ఈ క్రమంలో అసలు ఆ హంతకుడు ఎవరు..? హంతకుడి వేటలో ఉన్న జై పై కూడా కొందరు ఎలాంటి హత్య ప్రయత్నాలు చేస్తారు.. అతనెవరు అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
ఈ తరహా కథలు ఎప్పుడు కత్తి మీద సాములాంటివే. కథనం విషయంలో ఏ మాత్రం ఆడియన్స్ డీవియేట్ అయితే ఆ సినిమా పోయినట్టే. బట్ ఈ విషయంలో మృత్యుంజయ్ డిజప్పాయింట్ చేయదు. కథనం అదిరిపోయింది. ప్రతి సీన్ నూ చాలా బాగా రాసుకున్నారు. దీంతో పాటు పాటలు , కామెడీ సీన్స్ లేకపోవడం చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సినిమా మొదలైన కేవలం పది నిమిషాల్లోనే అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకూ ఎక్కడా బోర్ కొట్టకుండా ఆకట్టుకోవడం చాలా బావుంది. మామూలుగా ఇలాంటి మూవీస్ లో విలన్ ఎవరు అనేది చివర్లో అందరికీ తెలిసిపోతుంది. బట్ ఈ మూవీలో విలన్ ఎవరు అనేది ఆడియన్స్ కు ముందే తెలుసు. కానీ హీరోకు తెలియదు. ఈ విషయంలో రైటింగ్ అదిరిపోయింది అనే చెప్పాలి. ఇదో టాస్క్ కూడా. ఆ టాస్క్ లో బాగా మెప్పించాడు దర్శకుడు. ఎక్కువగా లేయర్స్ లేకుండా.. మెయిన్ పాయింట్ దాటకుండా.. ఆ పాపకు తండ్రి ఎలా చనిపోయాడు అనేది చెప్పడమే మెయిన్ టార్గెట్ గా సాగుతుంది కథనం. ఈ క్రమంలో క్లైమాక్స్ వరకు హంతకుడికి డీల్ ఇచ్చిన వాళ్లు ఎవరు..? అలాగే ఆ ఇద్దరు ఎలా చనిపోయారు అనేది ఇంకాస్త క్లియర్ గా చెప్పాల్సి ఉండేదేమో. ఆ విషయంలో మైనస్ లాగా కనిపిస్తుంది. బట్ మెయిన్ ప్లాట్ కు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఈ మైనస్ లతో వచ్చిన ఇబ్బంది ఏం లేదు అనేలా సినిమా ఆద్యంత ఆకట్టుకునేలా రూపొందించారు.
నటన పరంగా చూస్తే శ్రీ విష్ణు అదరగొట్టాడు. తన క్యారెక్టర్ ను దాటకుండా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో బాగా నటించాడు. పోలీస్ అధికారిణిగా రెబా మోనికా సింపుల్ గా చాలా బాగా చేసింది. సుదర్శన్ కామెడీకి దూరంగా ఉంటూ ఓ పాత్రలా ఆకట్టుకుంటాడు. రచ్చ రవి, అయ్యప్ప శర్మ బాగా చేశారు. అయితే అతను విలన్ గా మాత్రం అదరగొట్టాడు. అతను అద్భుతమైన నటన చూపించాడు. బాగా మెప్పించాడు.
టెక్నికల్ గా చూస్తే కాల భైరవ నేపథ్య సంగీతం బావుంది. పాటలేం లేవు. క్లైమాక్స్ టైటిల్ లో ఓ పాట వస్తుంది కానీ అందులో పెద్దగా ఆకట్టుకునేదేం ఉండదు. సినిమాటోగ్రఫీ బావుంది. క్రిస్ప్ గా ఉండే సినిమా కాబట్టి ఎడిటింగ్ బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బావున్నాయి. దర్శకుడు శ్రీ హుస్సేన్ షా కిరణ్ వర్క్ చాలా బావుంది. అతని రైటింగ్ చాలా చాలా బావుంది. ఈ తరహా కథల్లో ఇలాగే ఉండాలి అనే టెంప్లేట్ నే ఫాలో అవుతూ ప్రతి సీన్ లోనూ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా చేయడం కత్తి మీద సామే. ఆ విషయంలో దర్శకుడికి హ్యాట్సాఫ్ చెప్పాలి.
ఫైనల్ గా : మృత్యుంజయ్ సింప్లీ సూపర్బ్
రేటింగ్ : 3/5
బాబురావు. కామళ్ల