Arjun Sarja wife : అర్జున్ భార్య కూడా హీరోయినే.. ఒకే ఒక సినిమాలో నటించిన నివేదిత..!
Arjun Sarja wife : యాక్షన్ కింగ్ అర్జున్ దంపతులు నేడు పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన సతిమణి నివేదకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు;
Arjun Sarja wife : యాక్షన్ కింగ్ అర్జున్ తన పెళ్లిరోజున భార్యకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన సతిమణి నివేదితకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు అర్జున్.. నివేదిత కూడా హీరోయిన్ అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.. ఆమె హీరోయిన్‌గా ఒకే ఒక్క సినిమాలో నటించింది.
Happy anniversary my love..life is always beautiful with you. pic.twitter.com/ogZuqtdu44
— Arjun (@akarjunofficial) February 8, 2022
అది కూడా కన్నడ సినిమాలో.. పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు శివరాజ్‌కుమార్ హీరోగా వచ్చిన రథసప్తమి సినిమాలో హీరోయిన్‌గా నటించింది నివేదిత.. 1986లో రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా అమె అసలు పేరు ఆశారాణి. కన్నడ సినీ నటుడు రాజేష్ కుమార్తెనే ఈ అశారాణి.
నటుడు అర్జున్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకి దూరమైపోయింది నివేదిత. ఆమె క్లాసికల్ డాన్సర్ కూడా ... పలు వేదికలపైన ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఇక అర్జున్ దంపతుల ప్రేమకి గుర్తుగా ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.
పెద్ద కూతురు ఐశ్వర్య ఇప్పటికే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తమిళ్, కన్నడ సినిమాలు చేస్తోంది. ఇక చిన్నకూతురు అంజనా అర్జున్ న్యూయార్క్‌లో ఫ్యాషన్ డిజైనర్‌గా ట్రైనీ అవుతోంది.