నాని వరుస మూవీస్ చేస్తున్నాడు. యేడాదికి కనీసం రెండు రిలీజ్ లు అయినా ఉండేలా చూసుకుంటున్నాడు. కాకపోతే ఈ మధ్య స్పీడ్ తగ్గించాడు. యేడాదికి ఒక సినిమాగా చేస్తున్నాడు. ప్రస్తుతం ద ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు.ఈ మూవీలో అతని పాత్ర వేరే లెవల్ లో ఉండబోతోందని చెబుతున్నారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆ తర్వాత సుజీత్ డైరెక్షన్ లో సినిమాకు కమిట్ అయ్యాడు నాని. ఈ మూవీ కూడా భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాగా కనిపిస్తోంది. ద ప్యారడైజ్ తర్వాత వెంటనే సుజీత్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీపై కూడా చాలా అంచనాలున్నాయి. ఆపై మరో దర్శకుడితో కూడా మూవీ కమిట్ అయ్యాడు నాని.
హారిక హాసిని బ్యానర్ అంటే కేవలం త్రివిక్రమ్ కు మాత్రమే పరిమితం. అలాగే అని కాదు కానీ ఆ దర్శకుడు సితార బ్యానర్ కే పరిమితం అయ్యాడు. అతనే వెంకీ అట్లూరి. వెంకీ కొన్నాళ్లుగా సితార బ్యానర్ కే పరిమితం అయిపోయాడు. వరుసగా అదే బ్యానర్ లో మూవీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం సూర్య హీరోగా ఓ మూవీ చేస్తున్నాడు. సూర్యకు ఇదే ఫస్ట్ డైరెక్ట్ తెలుగు మూవీగా అవుతుంది. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చింది. ఆ తర్వాత వెంకీ అట్లూరి నానితో మూవీ చేయబోతున్నాడు.
నాని.. సుజీత్ తర్వాత వెంకీ అట్లూరితో మూవీకి కమిట్ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్ ను ఈ యేడాది చివరి నుంచే ప్రారంభించబోతున్నారు. అంటే నాని ఒక మూవీ చేస్తుండగా మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్ లోకి పెట్టుకుంటాడు కదా. అలా ఈ మూవీ కూడా ఉండబోతోంది. వెంకీ అట్లూరి స్టైల్ కు నాని పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. మరి ఈ కాంబోలో ఎలాంటి మూవీ వస్తుంది అనేది మాత్రం చూడాల్సిందే.