Aamir Khan : అమీర్ ఖాన్ అస్సాం టూర్‌ను క్యాన్సల్ చేసుకోమన్న అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ.. ఎందుకంటే..?
Aamir Khan : బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ ఈవారం అసోం పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ రిక్వెస్ట్ చేశారు.;
Aamir Khan : బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ ఈవారం అసోం పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ రిక్వెస్ట్ చేశారు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కాబట్టి తర్వాతి రోజులకు పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆమిర్‌ను సీఎం కోరారు. 'లాల్‌సింగ్ చద్దా' ప్రచారంలో భాగంగా ఈ నెల 14న ఆమిర్ ఖాన్ గువాహటిలో పర్యటించాల్సి ఉంది. అయితే, ముఖ్యమంత్రి తాజా రిక్వెస్ట్ తో ఆయన ఈనెల 16న గువాహటిలో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ వారంమంతా ఈసారి దృష్టి మొత్తం స్వాతంత్ర్య దినోత్సవంపైనా, తిరంగ కార్యక్రమంపైనా ఉందని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. అది పక్కదారి పట్టకూడదన్న ఉద్దేశంతో ఆమిర్ ఖాన్ తన టూర్ షెడ్యూల్ ను మార్చుకోవాలని రిక్వెస్ట్ చేసినట్లు సీఎం వెల్లడించారు. ఆమిర్ ఖాన్ ఎప్పుడొచ్చినా ఆయనతో కలిసి ముఖ్యమంత్రి సినిమా చూస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఇటీవల వరదలు సంభవించినప్పుడు ఆమిర్ ఖాన్ రూ. 25 లక్షల విరాళం అందించి ముఖ్యమంత్రి మనసులు గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా వెల్లడించి ఆమిర్‌ను ప్రశంసించారు.