ఐకన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా అతని నెక్ట్స్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేశారు. ఇది చాలా అంటే చాలా క్రియేటివ్ గా ఉంది. మామూలుగా ఏదైనా వీడియో రిలీజ్ తో అనౌన్స్ చేయడం వేరు. కానీ వీళ్లు తమ సినిమా విఎఫ్ఎక్స్ టీమ్ తో కలిసి ఓ అద్భుతమైన కథను అందించబోతున్నాం అని చెబుతూ రిలీజ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. చూడ్డానికి ఇప్పటి వరకూ అట్లీ చేసిన సినిమాలన్నీ రెగ్యులర్ కమర్షియల సినిమాలే కానీ.. ఈ సారి ఓ విజువల్ వండర్ ను క్రియేట్ చేయబోతున్నాడేమో అనిపించేలా ఉందీ వీడియో చూస్తోంటే. నిజానికి అతను త్రివిక్రమ్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టి మరీ అట్లీతో సినిమా కమిట్ అయినప్పుడే చాలామంది అనుకున్నారు. అట్లీ ఏదో అద్భుతమైన కథతోనే అప్రోచ్ అయ్యాడని. అయితే ఈ వీడియో చూస్తే ఇదేమీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా మాత్రం కనిపించడం లేదు. ఓ హాలీవుడ్ రేంజ్ కంటెంట్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు అనే గ్యారెంటీని వీళ్లు ప్రకటించినట్టుగా ఉంది.
ముందుగా నిర్మాత సన్ పిక్చర్స్ అధినేతను కలిసి హీరో, దర్శకుడు తర్వాత లాస్ ఏంజెలిస్ లోని లోలా విఎఫ్ఎక్స్ కంపెనీకి వెళ్లారు. ఎన్నో అద్భుతమైన హాలీవుడ్ సినిమాలకు విఎఫ్ఎక్స్ అందించిన జేమ్స్ మాడిగన్ ను కలిశారు. అతనే ఈ చిత్రానికి ఈ వర్క్ అందించబోతున్నాడు. కథ వినగానే వెంటనే ఒప్పేసుకున్నా అని చెప్పడం.. ఈ మూవీకి వర్క్ చేయడం కోసం ఎగ్జైటింగ్ గా ఉన్నాను అనడం.. స్క్రిప్ట్ గురించి అల్లు అర్జున్ అడిగినప్పుడూ మరో వ్యక్తి ఇది ది బెస్ట్ అని చెప్పాడు. చూస్తుంటే వీళ్లు బ్యాట్ మేన్, స్పైడర్ మేన్ తరహాలో ఓ సూపర్ మేన్ మూవీతో వస్తున్నారేమో అనిపిస్తోంది.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందబోతోన్న ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ తో పాటు అట్లీ కూడా భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారు. ఈ మూవీతో ఇండియాలోనే హయ్యొస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించబోతున్నాడు అంటున్నారు.