Chaysam: ఆ ఒక్కసారైనా కలుస్తారా ప్లీజ్.. చైసామ్‌కు అభిమానుల రిక్వెస్ట్
Chaysam: ఆన్ స్క్రీన్‌లో కొందరు కపుల్స్‌ను చూస్తుంటే వారు ఆఫ్ స్క్రీన్ కపుల్ అయితే బాగుంటుందని కోరుకుంటారు.;
Chaysam: ఆన్ స్క్రీన్‌లో కొందరు కపుల్స్‌ను చూస్తుంటే వారు ఆఫ్ స్క్రీన్ కపుల్ అయితే బాగుంటుందని ప్రేక్షకులు ఎంతగానో కోరుకుంటారు. అలాంటి కపుల్స్‌లో చైసామ్ కూడా ఒకరు. 'ఏమాయ చేసావే'తో ఆన్ స్క్రీన్ మీద కలిసినప్పుడే వీరి పెయిర్ ప్రేక్షకులకు చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. అలా వారు మళ్లీ మళ్లీ కలిసి నటిస్తుంటే ఈ కపుల్ అందరికీ మరింత దగ్గరయ్యింది. వీరి పెళ్లి గురించి రూమర్స్ మొదలయినప్పుడు అవి నిజమయితే బాగుండని చాలామంది కోరుకున్నారు.
ఇక పెళ్లి తర్వాత వీరు మళ్లీ కలిసి ఎప్పుడు నటిస్తారా అని ఎదురుచూసిన అభిమానులకు 'మజిలీ'ని కానుకగా ఇచ్చారు చైసామ్. అప్పటివరకు చై కెరీర్‌లో మజిలీనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇందులో ఆన్ స్క్రీన్ భార్యాభర్తలను ఆఫ్ స్క్రీన్ భార్యాభర్తలుగా చూసి చాలా ముచ్చటపడ్డారు ప్రేక్షకులు. ప్రస్తుతం పలు కారణాల వల్ల వీరు రియల్ లైఫ్‌లో కపుల్‌గా విడిపోయారు. కానీ వీరి విడాకుల వార్త అబద్ధం అయితే బాగుండు అని ఇప్పటికీ ఎంతోమంది కోరుకుంటున్నారు. అది జరగదు కాబట్టి ఫ్యాన్స్ అంతా వీరిముందు మరో రిక్వెస్ట్‌ను పెట్టారు.
పెళ్లి కాకముందైనా వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి చాలా క్రేజ్ ఉంది. అందుకే విడాకులు అయినా కూడా వారు ఎవర్‌గ్రీన్ ఆన్ స్క్రీన్ కపుల్‌గానే ఉండాలని చాలామంది కోరిక. చైసామ్ ఒక్కటిగా విడిపోయినా స్క్రీన్‌పై వారి పేర్లను మళ్లీ కలిపి చూడాలని అభిమానుల ఆశ. నిర్మాతలు కూడా అదే ఫీలింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వీరు మళ్లీ కలిసి సినిమా చేస్తే కలెక్షన్లను భారీగా కొల్లగొట్టే అవకాశం ఉంది కాబట్టి దర్శకనిర్మాతలు కచ్చితంగా వీరు కలిసి నటించేలా ఒప్పించగలరేమో..