2023లో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏదీ అంటే డౌట్ లేకుండా బేబీ సినిమానే చెప్పాలి. మినిమం బడ్జట్ తో రూపొందిన ఈ మూవీ ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టింది. ఈ ఫిగర్ ను ఎవరూ ఊహించలేదు అనే చెప్పాలి. ట్రై యాంగిల్ ల(స్ట్)వ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రంపై కొన్ని వర్గాల ప్రేక్షకులు విమర్శలు చేసినా కమర్షియల్ గా అద్భుతం అనిపించుకుంది. కల్ట్ బ్లాక్ బస్టర్ అని మేకర్స్ ప్రమోట్ చేసుకున్నారు. ప్రధానంగా యూత్ ను ఎక్కువగా అట్రాక్ట్ చేసిన బేబీ చిత్రానికి 8 విభాగాల్లో నామినేట్ అయితే 5 విభాగాల్లో అవార్డులు అందుకుని సత్తా చాటింది.
ఈ చిత్రానికి
క్రిటిక్స్ విభాగంలో బెస్ట్ ఫిల్మ్ గా అవార్డ్ వచ్చింది. హీరోయిన్ గా ఫస్ట్ మూవీనే అయినా క్రిటిక్స్ మెచ్చిన నటిగా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అందుకుంది వైష్ణవి చైతన్య. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ బెస్ట్ మ్యూజీషియన్ గా ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే పాట రాసిన అనంత శ్రీరామ్, పాడిన శ్రీరామ్ కు బెస్ట్ లిరిసిస్ట్, బెస్ట్ సింగర్ గా ఫిల్మ్ ఫేర్ వచ్చింది.
మొత్తంగా కమర్షియల్ గానే కాక, విమర్శియల్ గానూ బేబీ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మరి ఈ విజయయాత్ర ఇంకా కొనసాగుతుందేమో చూడాలి.