Bachchalamalli : జనవరి 9న ఓటీటీలోకి ‘బచ్చలమల్లి’?

Update: 2025-01-06 16:00 GMT

అల్లరి నరేశ్ నటించిన ‘బచ్చలమల్లి’ గతేడాది డిసెంబర్ 20న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనెల 9న అమెజాన్ ప్రైమ్‌లో చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. హరితేజ, రావు రమేశ్, సాయి కుమార్, రోహిణి, ధన రాజ్, హర్ష చెముడు, అచ్యుత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ సినిమాను నిర్మించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. చోటా కే ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరించారు. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. అల్లరి నరేష్ నటనకు కూడా మంచి పేరొచ్చింది. అయితే అప్పటికే రిలీజైన పుష్ప 2 ప్రభంజనంలో బచ్చల మల్లి సినిమా లాంగ్ రన్ ను కొనసాగించలేకపోయింది.

Tags:    

Similar News