Akhanda: అఖండ సినిమాకే హైలైట్‌గా నిలిచిన జోడు గిత్తలు
Akhanda: బాలకృష్ణ నటించిన అఖండ సినిమా చూసిన ఎవ్వరైనా.. ఆ ఎద్దుల ఫైటింగ్ సీన్‌కు ఫిదా అవ్వని వారు ఉండరు.;
Akhanda: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా చూసిన ఎవ్వరైనా.. ఆ ఎద్దుల ఫైటింగ్ సీన్‌కు ఫిదా అవ్వని వారు ఉండరు. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది ఈ సీన్. ఇక ఈ గిత్తెలతో హీరో అరంగేట్రం కూడా అదుర్స్‌గా నిలిచింది. సినిమాకే హైలైట్ గా నిలిచిన గిత్తెల గురించి తెలుగు రాస్ట్రాల్లో ఒకటే ఆసక్తి నెలకొంది. ఆ ఎద్దులను చూడడానికి చౌటుప్పల్ బాట పట్టారు.
నల్గొండ జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారానికి చెందిన రైతు శ్రీనివాస్ యాదవ్‌కు చెందినవి ఈ గిత్తెలు. ఆంధ్ర నుండి రెండు ఎద్దులను తీసుకొచ్చి వాటికి కృష్ణ, అర్జున అని పేర్లు కూడా పెట్టి ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ గిత్తెల వీడియో చూసి ఆఖండ సినిమా టీమ్ నుంచి పిలుపువచ్చిందని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆ విధంగా ఆఖండ సినిమాలో తన గిత్తెలను వాడుకున్నట్లు చెప్పారు. సినిమాతో ఫేమస్ అయిన తన గిత్తలను చూడడానికి పెద్ద ఎత్తున జనం వస్తున్నారని యాదవ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.