Balakrishna : బాలయ్య తాండవం.. బర్త్ డే స్పెషల్ గా అఖండ 2 టీజర్

Update: 2025-06-10 07:15 GMT

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న మూవీ అఖండ 2 తాండవం. అఖండకు సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ ను బాలయ్య బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందే విడుదల చేశారు. కంప్లీట్ గా బోయపాటి మార్క్ లోనే ఈ చిత్రం కూడా రాబోతోందనిపించేలా ఉందీ టీజర్. అఖండతో ఊహించని ఫీస్ట్ ఇచ్చాడు బోయపాటి. బాలయ్య అఘోరాగా నటిస్తే ఎలా ఉంటుందా అనే అన్ని క్వశ్చన్ మార్క్స్ కు ఆన్సర్స్ బ్లాక్ బస్టర్ తో చెప్పారు. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. వాటిని కూడా అందుకోబోతున్నాం అనిపించేలానే ఉంది ఈ టీజర్.

ఇక ఈ టీజర్ చూస్తే.. హిమాలయ పర్వత శ్రేణుల్లో దాడికి ప్రయత్నించిన కొందరు ముష్కరులను అఘోరాగా ఉన్న బాలయ్య అడ్డుకుని అందరినీ చంపేస్తూ రుద్ర తాండవం చేస్తున్నాడు. ‘నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా.. ’ అంటూ రౌద్రంగా బాలయ్య చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక త్రిశూలాన్ని మెడ చుట్టూ తిప్పి విలన్స్ ను చంపేయడం.. నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి. ‘వేదం చదివిన శలభం యుద్ధానికి దిగింది’ అనే డైలాగ్ మరో స్థాయిలో కనిపిస్తోంది.

మొత్తంగా బర్త్ డే స్పెషల్ టీజర్ కాబట్టి పూర్తిగా బాలయ్యపైనే కట్ చేశారీ టీజర్. కాకపోతే అఘోరాకు మాత్రమే పరిమితం అయ్యారు. ఆ రెండో పాత్రను కూడా చూపించి ఉంటే ఆ గెటప్ కూడా తెలిసిపోయేది. అఖండకు అద్భుతమైన ఆర్ఆర్ తో బ్యాక్ బోన్ గా నిలిచిన తమన్ మరోసారి అదే చేయబోతున్నాడు అనిపించేలా ఉంది. బాలయ్య మరోసారి డ్యూయొల్ రోల్ లోనే కనిపించబోతున్నాడు. విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. బాలయ్య కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.

Full View

Tags:    

Similar News