Balakrishna Talk Show: బుల్లితెరపై బాలయ్య తొడకొట్టనున్నాడు..
Balakrishna Talk Show: నందమూరి ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్‌బేస్ అంతా ఇంతా కాదు.;
Balakrishna (tv5news.in)
Balakrishna Talk Show: నందమూరి ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్‌బేస్ అంతా ఇంతా కాదు. ఆ ఫ్యామిలీలోని ప్రతీ హీరోకు క్లాస్‌తో పాటు మాస్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంటుంది. అందులోనూ నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆన్ స్క్రీన్ యాక్టింగ్‌తో పాటు ఆఫ్ స్క్రీన్ నేచర్‌కు కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. అలాంటి బాలయ్య ఇప్పుడు బుల్లితెరపైకి రాబోతున్నాడు.
ఓటీటీ అనేది వచ్చినప్పటి నుండి సినీ నిర్మాతల చూపంతా దానివైపే ఉంది. కొన్ని చిన్న సినిమాలు థియేటర్లను కాదని ఓటీటీల్లోనే విడుదల చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు వారి సొంత ఓటీటీలను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. అందులో ముందుగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ 'ఆహా' అనే ఓటీటీని ప్రారంభించాడు. దీని ద్వారా యంగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇవ్వడంతో పాటు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు హోస్ట్‌గా స్పెషల్ షోలను ప్లాన్ చేయిస్తున్నారు. అలాగే బాలయ్యతో కూడా అలాంటి ఒక టాక్ షోను ప్లాన్ చేసింది ఆహా.
ఇప్పటివరకు బాలకృష్ణను తన అభిమానులు సినిమాల్లోనే చూశారు. బాలయ్య అప్పుడప్పుడు బుల్లితెరపై పలు షోలలో గెస్ట్‌గా కూడా కనిపించాడు. కానీ మొదటిసారి తానే హోస్ట్‌గా ఒక షోలో కనిపిస్తున్నాడు అంటే ఆడియన్స్ అంతా దానికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బాలయ్య చేయనున్న షోకు 'ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్.. బాలయ్య అన్‌స్టాపబుల్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.