నందమూరి బాలకృష్ణ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. నాన్ స్టాప్ విజయాలతో దూసుకుపోతున్నాడు. హ్యాట్రిక్ కూడా దాటేశాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో డబుల్ హ్యాట్రిక్ మూవీకి శ్రీకారంగా అఖండ 2 షూటింగ్ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా అఖండ 2 షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. అక్కడే హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకుందీ మూవీ. బాలయ్య డ్యూయొల్ రోల్ చేస్తోన్న ఈ మూవీకి మరోసారి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ పార్ట్ లో ఫస్ట్ పార్ట్ టీమ్ తో పాటు సంయుక్త మీనన్ కూడా జాయిన్ అవుతోంది.
అఖండ 2 చిత్రాన్ని దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదల చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు. ఆ మేరకు ఓ పోస్టర్ కూడా వచ్చింది. గతేడాది అదే టైమ్ కు సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓ.జి’చిత్రం విడుదలవుతుందని చెప్పారు. కానీ ఓ.జి రాలేదు. చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి.
పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఎప్పుడో స్టార్ట్ అయిన హరిహర వీరమల్లును పూర్తి చేశాడు. జూన్ 12న హరిహర విడుదల కాబోతోంది. నెక్ట్స్ ఓజీకి కూడా డేట్స్ ఇవ్వబోతున్నాడు. పవన్ ఈ చిత్రం కోసం 20 రోజులు కేటాయిస్తే చాలట. వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసి నాన్ స్టాప్ చిత్రీకరణతో కంప్లీట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు దర్శకుడు సుజిత్. అలా జరిగితే ఈ మూవీని సెప్టెంబర్ 25కే విడుదల చేయాలనుకుంటున్నారు.
మరి పవన్ కళ్యాణ్ ఓ.జి విడుదల తేదీ ఖరారైతే బాలయ్య అఖండ 2 పోటీలో ఉంటుందా లేక తప్పుకుంటుందా అనే న్యూస్ వినిపిస్తున్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. తమ్ముడు మూవీకి పోటీ ఇవ్వకపోయినా.. అన్నయ్య మూవీకి బాలయ్య పోటీగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. యస్.. ఒకవేళ సెప్టెంబర్ మిస్ అయితే సంక్రాంతికి అఖండ 2 ను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అంటే సంక్రాంతికి ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ అనౌన్స్ అయి ఉంది కదా. సో బాలయ్య తమ్ముడికి దారి ఇచ్చి అన్నయ్యకు పోటీగా నిలిచే అవకాశాలు చాలానే ఉన్నాయంటున్నారు.