Balakrishna : బాలకృష్ణ విలన్ పని అయిపోయిందట

Update: 2024-08-08 10:26 GMT

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్ట్ చేస్తోన్న మూవీ షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. వాల్తేర్ వీరయ్య తర్వాత బాబీ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. అటు బాలయ్య కూడా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూవీస్ తో హ్యాట్రిక్ కొట్టి ఉన్నాడు. అందుకే అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడం గ్యారెంటీ అని ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ చూస్తే అర్థం అవుతుంది. బాలయ్య సరసన ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక విలన్ గా యానిమల్ ఫేమ్ మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్ బాబీ డియోల్ నటిస్తున్నాడు.

డిసెంబర్ లో విడుదల కాబోతోన్న ఈ మూవీలో విలన్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని చెబుతూ లేటెస్ట్ గా దర్శకుడు బాబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం రాజస్తాన్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. అక్కడ జరిగిన షూటింగ్ తోనే బాబీ డియోల్ కు సంబంధించిన పార్ట్ పూర్తయిందట.

ఇక మిగిలిన షూటింగ్ ను హైదరబాద్ లోనే నెక్ట్స్ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారట. మొత్తంగా ఈ మూవీ టైటిల్ విషయంలోనే ఇంకా ఏదీ ఫైనల్ కావడం లేదు. బాలయ్య మూవీ అంటే టైటిల్ తోనే సగం పవర్ కనిపించాలి. అలాంటి టైటిల్ కోసమే చూస్తున్నారని చెబుతున్నారు. లేదా ఆల్రెడీ సినిమాకు పేరు పెట్టినా అది అనౌన్స్ చేసేందుకు సరైన టైమ్ కోసం చూస్తున్నారో కానీ.. ముందు టైటిల్ వస్తే ఫ్యాన్స్ ఓ అంచనాకు వస్తారు కదా.. అనేది అభిమానుల అభిప్రాయం.

Tags:    

Similar News