ఏజ్ పెరుగుతుంటే అందరికీ నీరసం వస్తుంది.. కానీ నందమూరి బాలకృష్ణకు మరింత ఊపు పెరుగుతోంది. అందుకే ఈ ఏజ్ లో కూడా నాన్ స్టాప్ బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా యాక్షన్ విషయంలో అస్సలు తగ్గేదే లే అన్నట్టుగా దూకుడు చూపిస్తున్నాడు. అందరికీ తెలుసు బాలయ్య మూవీస్ లో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందీ అనేది. అలాంటి బాలయ్య.. ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ మీదే ఇంత వయొలెన్స్ రాలేదు అనేలా అందరి చేతా అనిపించుకున్న దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అనే వార్త తెగ వినిపిస్తోంది. పైగా ఆ దర్శకుడి కోసం చాలామంది హీరోలు ప్రయత్నిస్తున్నారు అని అతని మోస్ట్ వయొలెంట్ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి వినిపిస్తోంది. ఇందుకు సౌత్ మాత్రమే కాదు.. నార్త్ కూడా మినహాయింపేమీ కాదు. మరి ఆ డైరెక్టర్ ఎవరో ఇంకా గెస్ చేయలేకపోయారా.. ? యస్.. హనీఫ్ అదేనీ.
గతేడాది ‘మార్క్’అనే మూవీతో వెండితెరపై రక్తాన్ని ఏరుల్లా పారించిన దర్శకుడితను. తెరంగా రక్తం విరజిమ్మినా.. ఆడియన్స్ ను కన్విన్స్ చేయగలిగిన చాతుర్యం ఉన్న దర్శకుడు. అలాంటి డైరెక్టర్ తో నందమూరి బాలకృష్ణ సినిమా చేయబోతున్నాడు అని ఊహించకుంటేనే ఓ రేంజ్ లో ఉంది కదా..? అలాగని మళ్లీ అదే హింసాత్మక కథతో వస్తాడు అనుకోలేం. బట్ ఇద్దరి ఇమేజ్ ల ప్రకారంగా వచ్చినా చాలు.. తెలుగు తెరపై ఇంతకు ముందెప్పుడూ చూడనంత ఊచకోత చూస్తాం.
హనీఫ్ అదేనీ రీసెంట్ గా బాలయ్య తో ‘మ్యాన్షన్ హౌస్’యాడ్ చేశాడు. ఆ సందర్బంగానే ఇద్దరికీ సెట్ అయిందంటున్నారు. దర్శకుడి స్టైల్ నచ్చడం వల్లే బాలయ్య కథ విన్నాడని.. ఇద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనీ అంటున్నారు. పైగా ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నాడు అనే టాక్ కూడా ఉంది. విశేషం ఏంటంటే.. తాజాగా బాలయ్య 111వ సినిమా అంటూ గోపీచంద్ మలినేనితో ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయింది. ప్రస్తుతం ఆయన బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 : తాండవం సినిమా చేస్తున్నాడు. అంటే నెక్ట్స్ మూవీ గోపీచంద్ తోనే. మరి హనీఫ్ అదేనీ మూవీ ఆ తర్వాత ఉంటుందా లేక ఇది కేవలం రూమరేనా అనేది బాలయ్య బర్త్ డే సందర్భంగా రివీల్ అవుతుంది. లేదా మరికొంత కాలం ఆగొచ్చు. అదీ కాదంటే.. హనీఫ్ తో చాలామంది హీరోల పేర్లు వినిపించినట్టుగానే ఇదీ మరో రూమర్ గా మిగిలిపోతుంది.