ఇవాళ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావ శతజయంతి. ఈ సందర్భంగా ఇండస్ట్రీ ఆయన్ని ఘనంగా స్మరించుకుంటుంది అని భావించారు అభిమానులు. బట్ పరిశ్రమ తరఫు నుంచి అలాంటివేం కనిపించడం లేదు. బట్ ఒక్కడు స్పందించాడు. ఆయనే నందమూరి బాలకృష్ణ. నిజానికి బాలయ్య ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ ముందే ఉంటాడు. ముఖ్యంగా పెద్ద వారి విషయంలో చాలా పద్ధతిగా ఉంటాడు. బట్ కొన్నాళ్ల క్రితం ఓ సినిమా ఫంక్షన్ లో యథాలాపంగా అన్న ఒక మాట అప్పట్లో దుమారం రేపింది. దీనికి అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య, అఖిల్ తో పాటు యువ హీరోలు స్పందించారు. నాగార్జున రియాక్ట్ కాలేదు.
చాలాకాలంగా నాగార్జున, బాలయ్య మధ్య ఓ గ్యాప్ అయితే ఉందనేది అందరికీ తెలుసు. ఈ గ్యాప్ ను రాబోయే రోజుల్లో అన్ స్టాపబుల్ షోతో ఫిల్ చేయబోతున్నారనే టాక్ కూడా ఉంది. అవన్నీ ఎలా ఉన్నా.. అక్కినేని శతజయంతి వేళ బాలయ్య ఒక లేఖ విడుదల చేయడం.. అది ఎంతో జెన్యూన్ గా ఉండటం చూసి అప్పట్లో ఆయన్ని అపార్థం చేసుకున్న వాళ్లు కూడా అభిమానిస్తున్నారు. ఇంతకీ ఆ లేఖలో ఏముందీ అంటే..
''తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఆయనను స్మించుకోవడం గర్వకారణం. మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయాలు. ఆయన కృషి, కీర్తి, మరి స్ఫూర్తి ప్రతి నటునికి మార్గదర్శకం. ఈ శతజయంతి సందర్భంగా, తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరసు వంచి కృతజ్నతలు తెలుపుదాం. నాటక రంగం నుండి చిత్ర రంగం వరకు, ఆయన చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణ..
ఈ రోజు ఆయనకు మనమందరం నివాళి అర్పిస్తూ, ఆయన నటన, కృషి, మరియు పట్టుదలతో వెలసిన విజయాలను స్మరించుకుందాం .''
- నందమూరి బాలకృష్ణ
ఇదీ ఆ లేఖ సారాంశం.