Bandla Ganesh: 'దేవర రథచక్రానికి కీలునౌతా'.. మరోసారి పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్..

Bandla Ganesh: పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్.. ఈ కాంబినేషన్ అంటే చాలామందికి ఇష్టం.

Update: 2022-03-13 15:03 GMT

Bandla Ganesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఎంతలా ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకుల్లోనే కాదు.. సినీ సెలబ్రిటీల్లో కూడా చాలామంది పవర్ స్టార్‌కు అభిమానులే. అయితే అందులో అందరికన్నా పెద్ద అభిమాని ఎవరంటే.. చాలామందికి ముందుగా గుర్తొచ్చే పేరు బండ్ల గణేష్. ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌పై ఏదో ఒక ట్వీట్ చేస్తూ.. హల్‌చల్ చేసే బండ్ల గణేష్ తాజాగా మరో ట్వీట్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్.. ఈ కాంబినేషన్ అంటే చాలామందికి ఇష్టం. పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ అంటే అక్కడ బండ్ల గణేష్ ఉండాల్సిందే అన్న రేంజ్‌లో ఆయన స్పీచ్‌లకు పాపులారిటీ వచ్చింది. అయితే ఆయన స్పీచ్‌లు మాత్రమే కాదు.. ట్వీట్లు కూడా మొత్తం పవన్ కళ్యాణ్‌తోనే నిండి ఉంటాయి. నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ మరోసారి వైరల్‌గా మారింది.

'వీరులారా ధీరులారా,జన సేన సైనికులారా !! రండి కదలి రండి కడలి అలగా తరలి రండి. నేను కూడా వస్తున్నాను. మన దేవర నిజాయతీకి సాక్షిగా నిలబడడం కోసం, తెలుగు వాణి వాడి వేడి నాడి వినిపించడం కోసం, అమరావతి నించి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం. కలిసి పోరాడదాం' అంటూ జనసేన ఆవిర్భావ దినోత్సవానికి పిలుపునిచ్చారు. అంతే కాకుండా 'దేవర జెండా కి కర్రనౌతా.. దేవర రధచక్రానికి కీలునౌతా' అంటూ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు బండ్ల గణేష్.

Tags:    

Similar News