Bandla Ganesh: పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ మరో క్రేజీ ట్వీట్..
Bandla Ganesh: బండ్ల గణేష్ తన ట్వీట్లలో కూడా పవన్ కళ్యాణ్‌పై అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు.;
Bandla Ganesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ప్రేక్షకుల్లోనే కాదు.. సినీ సెలబ్రిటీల్లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటే బండ్ల గణేష్ అక్కడ ఉంటాడు అని ప్రేక్షకులు కూడా బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయారు. అయితే బండ్ల గణేష్ తన ట్వీట్లలో కూడా పవన్ కళ్యాణ్‌పై అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు. తాజాగా మరోసారి ఓ క్రేజీ ట్వీట్ చేశాడు బండ్ల.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎప్పుడూ మాస్, కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించే పవన్.. క్రిష్‌తో కలిసి 'హరిహర వీరమల్లు' అనే పీరియాడిక్ డ్రామాను చేస్తున్నాడు. ఇది పవన్ కెరీర్‌లోనే పెద్ద ప్రయోగం అనే చెప్పాలి. అయితే ఈ పీరియాడిక్ డ్రామా కోసం పవన్ ట్రైన్ అవుతున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై బండ్ల గణేష్ స్పందించాడు.
'గన్ను పట్టిన.. పెన్ను పట్టిన.. కత్తిపట్టిన.. మైకు పెట్టినా.. ఏది పట్టిన ఎవరిపై గురి పెట్టిన మీకు తీరుగు లేదు దేవర' అంటూ పవన్ కళ్యాణ్ ట్రైనింగ్‌లోని ఓ ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్.
గన్ను పట్టిన పెన్ను పట్టిన కత్తిపట్టిన మైకు పెట్టినా ఏది పట్టిన ఎవరి పై గురి పెట్టిన మీకు తీరుగు లేదు దేవర 👌 @PawanKalyan pic.twitter.com/WlKa6lnxE0
— BANDLA GANESH. (@ganeshbandla) April 7, 2022