సంతోష్ శోబన్.. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ సినిమాలన్నీ పోతున్నాయి. ఆ మధ్య ఏదో ఒకటి హిట్ పడినట్టుంది. తర్వాత అన్నీ పోయాయి. అలాంటి టైమ్ లో ఈ సారి ష్యూర్ షాట్ అనిపించేలా ‘కపుల్ ఫ్రెండ్లీ’మూవీతో వస్తున్నాడు. మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన టీజర్, పాట కూడా బావున్నాయి. బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో పాట విడుదల చేశారు.
గాబరా గాబరా సోదరా.. లైఫ్ మొత్తం.. కాలమే తన్నెలా లక్కునీ అంటూ సాగే గీతం ఇది. పాట వినగానే ఆకట్టుకునేలా ఉంది. హీరో క్యారెక్టరైజేషన్ కు తగ్గట్టుగానే ఈ పాట కనిపిస్తోంది. తను చదువుకున్న దానికంటే తక్కువ స్థాయిలో పని చేయడం మాత్రం ఉంది. ఆ క్రమంలో హీరోతో పాటు హీరోయిన్ కు సైతం వర్తించేలా పాట ఉంది. ఈ పాటను రాకేందు మౌళి రాశాడు. సంతోష్ నారాయణన్ పాడాడు. ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందించాడు. మార్చి 14న విడుదల కాబోతోన్న ఈ మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.