విజయ్ దేవరకొండ ఒక బలమైన కమ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంది. వరుసగా సినిమాలు పడుతున్నాయి. బట్ సక్సెస్ మాత్రం రావడం లేదు. అయితే ఈ సారి చేస్తోన్న రెండు సినిమాలు మాత్రం స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అవుతాయి అని భావిస్తున్నారు. ఒకటి రౌడీ జనార్థన్. రెండోది రణబాలి. రణబాలి మూవీని రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేస్తున్నది. ఈ మూవీ గురించి చాలా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా గ్లింప్స్ వచ్చిన తర్వాత మూవీ రేంజ్ మారిపోయింది. ఈ గ్లింప్స్ తో మూవీ స్థాయి పెరగబోతోంది అనేది అర్థం అవుతుంది. భారీ స్థాయిలో సినిమా రూపొందబోతోంది అనిపించేలా ఉంది. కథ, కథనం పట్ల కూడా చాలా క్లియర్ గా ఉండబోతున్నారు అనిపించారు. రాహుల్ సాంకృత్యన్ బ్యాక్ గ్రౌైండ్ వేరే ఉంది. అతను ఎంచుకునే కథలు వేరే ఉంటాయి. కథనం కూడా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తుంటాడు. శ్యామ్ సింగరాయ్ తోనే అది తేలిపోయింది. రణబాలి మూవీ కోసం చాలా ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. టైమ్ తీసుకున్నా బలమైన కథతోనే వస్తున్నాడు అనిపించేలా ఉంది.
రణబాలి కథ మాత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ‘శప్తభూమి’అనే నవల ఆధారంగా రూపొందుతోంది అనిపించింది. ఈ నవలను రాసింది బండి నారాయణ స్వామి. ఈయన నవలలు అద్భుతం అనే పదానికి కూడా చాలా చిన్నదే అనేలా ఉంటాయి. ప్రతి నవలనూ రియలిస్టిక్ గానూ ఉండే పాత్రలతోనే రాశాడు. ప్రధానంగా రాయలసీమ నేపథ్యంలోనే అతని నవలలన్నీ కనిపిస్తాయి. మరి ఇలాంటి నవలతో రాహుల్ సాంకృత్యన్ సినిమా తీయడం మాత్రం ఖచ్చితంగా ఓ బలమైన సందేశం నిండి ఉండేలానే ఉంటుంది. పీరియాడిక్ మూవీ అయినా కూడా.. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తోనే నిండి ఉండేలా సినిమా ఉండబోతోంది అనిపిస్తోంది.
అయితే రాహుల్ సాంకృత్యన్ కేవలం శప్తభూమి నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడా లేక ఇంక వేరే కథతో వస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. బట్ మాగ్జిమం మాత్రం శప్తభూమి నవలతోనే సినిమాగా రూపొందిస్తున్నాడు అంటున్నారు.