పాటంటే మనసుకు హత్తు కోవాలి. పాట వింటే మనసు మైమరచిపోవాలి. అలాంటి పాటలు అరుదుగా వస్తుంటాయి. ఇక ఈ జనరేషన్ లో అయితే అన్నీ ఫాస్ట్ బీట్సే. బట్ ప్రతి సినిమాలోనూ ఓ మెలోడీ ఉండాల్సిందే అన్నట్టుగా కొన్నాళ్లుగా మన మ్యూజీషియన్స్ మ్యాజిక్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సౌత్ లో ఈ ట్రెండ్ బాగా ఉంది. కొందరికి కోపం వచ్చినా పెద్ద సినిమాల్లోని మెలోడీస్ కంటే చిన్న సినిమాల్లోని మెలోడీసే ఎక్కువ మెస్మరైజ్ చేస్తున్నాయి. తాజాగా సంతాన ప్రాప్తిరస్తు అనే మూవీ నుంచి వచ్చిన పాట అందుకు మరో ఉదాహరణ.
విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటిస్తోన్న ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన పాట ఇన్ స్టంట్ గా ఎక్కేసే మెలోడీ. మళ్లీ మళ్లీ వినాలనిపించేంత మాధుర్యం ట్యూన్ లో ఉంటే.. మనసు దోచుకునేలాంటి సాహిత్యం కనిపిస్తోంది. నాలో యేదో మొదలైందనీ ‘నీతో చెలిమే రుజువైందనీ కనులే చెబితే, మనసే వినదా నిజమే అనదా…’ అంటూ సాగే ఈ గీతాన్ని శ్రీజో రాయగా దిన్ కర్, అదితి భావరాజు కలిసి పాడారు. సునిల్ కశ్యప్ సంగీతం అందించాడు. ట్యూన్ లోని రాగాస్ చూస్తే భలే అనిపిస్తుంది.
ఇక సాహిత్యం లో ‘ఊరు కాని ఊరిలో వింత వేడుక, ఊరుకోని గుండెలో, లేదు తీరిక పడిగాపులే అలవాటుగా, మారేంతగా మారానుగా నీ స్నేహమే యెద నిండగా..’వంటి మెరుపులు ఉన్నాయి. ఇది చూస్తే అప్పుడే ప్రేమలో పడిన ఓ జంట తమ మనసులోని భావాలను చెప్పుకున్నట్టుగా, అవతలి వ్యక్తిపై ఉన్న ఫీలింగ్స్ ను ఎక్స్ ప్రెస్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తంగా ఓ మంచి సంగీతంతో కూడిన ఈ మెలోడీ వినగానే ఆకట్టుకునేలా ఉంది.