మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచీ అందరిలోనూ ఒకటే ప్రశ్న.. హీరోయిన్ ఎవరు..? అని. సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం చాలా కష్టమైపోతోందనేది వాస్తవం. యంగ్ బ్యూటీస్ తో రొమాన్స్ చేస్తే ఆడియన్స్ తప్పు పడతారు. వీరి ఏజ్ కు తగ్గ భామలేమో ఆల్రెడీ బిజీగా ఉండటమో లేక లైట్ తీసుకోవడమో చేస్తున్నారు. అందుకే చిరంజీవి కోసం ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. ప్రధానంగా నయనతార చేయబోతోందనే వార్తలు వచ్చాయి. ఆల్రెడీ నయన్ తో సైరా నరసిహారెడ్డి, గాడ్ ఫాదర్ మూవీస్ చేశాడు మెగాస్టార్. మరోసారి తను ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ కాబోతోందనే వార్తలు వస్తున్నాయి. కానీ ఏదీ కన్ఫార్మ్ కావడం లేదు. బట్ లేటెస్ట్ గా కేథరీన్ థ్రెసాను తీసుకున్నారు అనేది కన్ఫార్మ్ అంటున్నారు.
చాలాకాలంగా ఇండస్ట్రీలో ఉన్నా.. ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు కేథరీన్ కు. ఆ మధ్య అల్లు అర్జున్ తో సరైనోడు మూవీలో నటించింది. అందులో యంగ్ ఎమ్మెల్యేగా అదరగొట్టింది. అలాగే తేజ డైరెక్ట్ చేసిన నేనే రాజు నేనే మంత్రిలో రానాతో రొమాన్స్ ను ఇరగ పండించింది. రీసెంట్ గా తమిళ్ లో సుందర్ సి హీరోగా నటించిన మూవీలో తనే హీరోయిన్. ఈ టైమ్ లో మెగా ఆఫర్ అంటే అమ్మడికి అదృష్టం కలిసొచ్చినట్టే. అయితే తను చిరంజీవికి జోడీగా నటిస్తోందా లేక ఇంకేదైనా కీలక పాత్ర చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.