Bedurulanka 2012 Trailer: మనసు కన్నా అందానికే గ్యారంటీ.. యుగాంతం కథాంశంతో రూరల్ కామెడీ డ్రామా

'బెదురులంక 2012' ట్రైలర్ లాంఛ్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Update: 2023-08-19 11:07 GMT

కార్తికేయ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'బెదురులంక 2012' ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంఛ్ చేశారు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్‍గా నటిస్తోన్న ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్ పై ఆగస్టు 15న అప్ డేట్ ఇచ్చిన మేకర్స్.. ముందు చెప్పినదాని కంటే ఒక రోజు ఆలస్యంగా ఆగస్టు 16న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే 2012 సంవత్సరం నేపథ్యంలో రూరల్ కామెడీ డ్రామాగా ‘బెదురులంక 2012’ తెరకెక్కింది.“2012 డిసెంబర్ 21 ప్రపంచమంతా యుగాంతం వస్తుందని, ప్రళయం వస్తుందని భయపడిన రోజు.. కానీ ఎక్కడా ఏం జరగలేదు.. మా ఊర్లో తప్ప” అంటూ అజయ్ ఘోష్ వాయిస్ ఓవర్‌తో ‘బెదురులంక 2012’ మొదలైంది. “మనసుది ఏముంది చిత్రా (నేహాశెట్టి) మూడు నిమిషాల్లో మారిపోతుంది. కానీ అందం అనుకో.. ఐదారేళ్లయినా గ్యారంటీ ఉంటుంది” అని కార్తికేయ చెప్పే డైలాగ్ ట్రైలర్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఇక హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. యుగాంతం అంశాన్ని ఉపయోగించుకొని ప్రజలను కొందరు మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం చుట్టూ కామెడీ సీన్లను దర్శకుడు తెరకెక్కించినట్టు ట్రైలర్‌లో తెలుస్తోంది. యుగాంతం వస్తుందనే విషయాన్ని కార్తికేయ కొట్టేస్తుంటారు. మొత్తానికి బెదురులంక ట్రైలర్ అత్యంత క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది.

‘బెదురులంక 2012’ సినిమాను లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ప్రొడ్యూజ్ చేశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ మూవీ మ్యూజిక్ ఎలా ఉంటుందన్న దానికి ఈ ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సంగీతమే ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. కాగా ఈ సినిమాలో అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఎల్బీ శ్రీరామ్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.


Full View


Tags:    

Similar News