Bheemla Nayak First Review : భీమ్లానాయక్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

Bheemla Nayak First Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న మూవీ భీమ్లానాయక్..

Update: 2022-02-19 09:41 GMT

Bheemla Nayak First Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న మూవీ భీమ్లానాయక్.. రానా దగ్గుబాటి మరో హీరోగా నటించాడు.. షూటింగ్, సెన్సార్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 25 న గ్రాండ్ గా రిలీజ్‌ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇదిలావుండగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.


రాబోయే సినిమాలకి సంబంధించిన రివ్యూలను ట్విట్టర్ వేదికగా పంచుకోవడంలో ఉమైర్ సంధు ఎప్పుడు ముందే ఉంటాడు. అలాగే భీమ్లానాయక్ మూవీకి సంబంధించిన ఉమైర్ సంధు తన రివ్యూ ఇచ్చేశాడు.. "దేవునికి ధన్యవాదాలు.. మన పవర్ స్టార్ మళ్లీ తన ఫేవరెట్ జానర్‌లోకి వచ్చాడు. "బ్లాక్‌బస్టర్ కమ్ బ్యాక్ ఫిల్మ్". భీమ్లా నాయక్ సినిమా కాదు.. వేడుక! అవుట్ స్టాండింగ్ మాస్ ఫిలిం..వాట్ ఏ సినిమా.. సినిమా చూశాక అభిమానులు గంతులేస్తారు" అని రాసుకొచ్చాడు.


ఇక సినిమాలో పవన్ ఇంట్రడక్షన్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతారని ఉమైర్ సంధు ఇటీవల వెల్లడించారు. ఉమైర్ సంధు రివ్యూతో సినిమా పైన అంచనాలు మరింతగా పెరిగాయి. కాగా మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్‌‌కి రీమేక్‌‌గా భీమ్లానాయక్ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. తమన్ సంగీతం సమకూర్చాడు. నిత్యామీనన్ మరియు సంయుక్తా మీనన్ హీరోయిన్ లుగా నటించారు.

Tags:    

Similar News