పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ టైమ్ లో ఓ అనూహ్యమైన రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హరిహర వీరమల్లు చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఓ కేమియో రోల్ చేశాడు అనేదే ఆ రూమర్. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. మరి ఈ న్యూస్ ఎలా వచ్చిందో ఏమో కానీ.. గౌతమీపుత్ర శాతకర్ణి వంటి హిస్టారికల్ మూవీతో ఆడియన్స్ కు మెస్మరైజ్ చేసిన బాలయ్య.. ఈ పీరియాడిక్ ఫిక్షన్ అయిన్న వీరమల్లు నటించడం ఎలా కుదురుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే.. నిర్మాత ఏఎమ్ రత్నంకు అది ప్రమోషనల్ గా ఎంత పెద్ద హైప్ తెస్తుంది. అయినా వాడలేదు అంటే ఖచ్చితంగా ఈ మూవీలో బాలయ్య లేడు అనే కదా అర్థం. కాకపోతే వినడానికి మాత్రం బావుంది. పవన్ మూవీలో బాలయ్య కేమియో అనేది ఖచ్చితంగా రూమర్ అయినా ఆకట్టుకునే మాటే.
ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే చాలా ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉన్న చిత్రంగా వీరమల్లును చెబుతున్నారు. నిధిఅగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ నటించాడు. ప్రమోషన్స్ పరంగా హీరో, హీరోయిన్ తప్ప మరే ఆర్టిస్ట్ నూ ఇన్వాల్వ్ చేయలేదు. ఏదేమైనా ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఓ స్పెషల్ గా నిలిచిపోతుందని మాత్రం చెబుతున్నారు.