Sarayu : మీ మనోభావాలు దెబ్బతినుంటే సారీ : సరయు
Sarayu : బిగ్‌బాస్ కంటెస్టెంట్ సరయుపై ఇటీవల ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే..;
Sarayu : బిగ్‌బాస్ కంటెస్టెంట్ సరయుపై ఇటీవల ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే.. అమె నటించిన ఓ షార్ట్ ఫిల్మ్‌లో హిందువుల మనోభావలు దెబ్బతినేలా ఉన్నాయంటూ సిరిసిల్లా జిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి గతంలో సరయు పైన కేసు పెట్టారు. ఏడాది తర్వాత ఆ కేసును బంజారాహిల్స్‌కు బదిలీ చేశారు. పోలీసుల విచారణకి కూడా సరయు హాజరైంది.
ఇదిలావుండగా ఈ కేసు పైన సరయు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ఇందులో సరయు మాట్లాడుతూ.. ఒక నటిగా దర్శకుడు ఏది చెప్తే అది చేసి వెళ్తానని, తాను కూడా ఒక హిందువునేని చెప్పుకొచ్చింది. తన మతం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే సహించనని, పూజారులను అన్యాయంగా చంపేస్తున్నారని పోస్ట్ పెట్టినందుకే నా ఫేస్‌బుక్ డిలీట్ చేశానని తెలిపింది.
ఓ బిర్యానీ ప్రమోషన్‌లో గణపతి బప్పా రిబ్బన్ కట్టుకుని మందు తాగామని అయితే ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి అలా చేయలేదని, విజయ్ సేతుపతి సినిమాలో నుంచి ఒక సీన్‌ను రిఫరెన్స్‌గా తీసుకునే అలా చేశామని చెప్పుకొచ్చింది. కానీ అది విశ్వ హిందూ పరిషత్ వాళ్లకు నచ్చేలేదని, దీనితో ఆ సీన్ ని తీసేశామని పేర్కొంది.
హిందూ అమ్మాయిగా తాను హిందువుల మనోభావాలను కించపరచనని, ఒకవేళ తనవల్ల ఎవరి మనోభావాలైన దెబ్బ తినుంటే సారీ అని చెప్పుకొచ్చింది.