Bigg Boss Telugu Season 6 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 డేట్ వచ్చేసింది..?
Bigg Boss Telugu Season 6 : రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 6 త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.;
Bigg Boss Telugu Season 6 : రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 6 త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. బుల్లితెర తెలుగు ప్రేక్షకులను వీపరితంగా అలరించిన బిగ్‌బాస్ త్వరలోనే సీజన్6 ప్రేక్షకుల ముందుకు రానుంది. గత మూడు సీజన్ల కు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున.. ఈ కొత్త సీజన్‌లోనూ వినోదం పంచనున్నారు.
ప్రస్తుతం ఈ కొత్త సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్‌ల ఎంపిక పూర్తయింది. అంతేకాదు, వారిని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు నిర్వహించే గ్రాండ్ ఎంట్రీ ఈవెంట్‌ను కూడా దాదాపు పూర్తి చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. సెప్టెంబరు 4వ తేదీ నుంచి బిగ్‌బాస్ సీజన్-6' టెలికాస్ట్ కానుంది. ఈ సీజన్‌లో ఎంతమంది హౌస్‌లోకి వెళ్తున్నారు? ఎవరెవరు వెళ్తున్నారన్నది ఆసక్తిగా మారింది.