నయనతార.. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలవుతోంది. కెరీర్ ఆరంభంలో అనేక ఒడిదుడుకులు తట్టుకుంటుంది. కానీ సక్సెస్ రేట్ మాత్రం బాగా పెరిగింది అనేది చెప్పాలి. సౌత్ మొత్తం ఇండస్ట్రీలోని తిరుగులేని విజయాలు అందుకుంటోంది. కెరీర్ ఆరంభంలో లవ్ ఎఫైర్స్ విషయంలో తట్టుకుని నిలబడింది. చివరికి మూడో లవర్ గా విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. ఇద్దరు సరోగసీతో పిల్లలను కన్నది కూడా. కాకపోతే ఇప్పటి వరకు తన కెరీర్ విషయంలో మాత్రం ఎప్పుడూ ఆగిపోలేదు. ఓ వైపు సోలో హీరోయిన్ గా సత్తా చాటుతోంది. మరోవైపు రెగ్యులర్ హీరోయిన్ గా ఆకట్టుకుంటోంది.
తన వయసుకు తగ్గ పాత్రలకు మాత్రమే కాదు.. వయసుకు మించిన పాత్రలతోనే అలరిస్తోంది. సీనియర్ హీరోలతో జత కడుతోంది. సీనియర్ హీరోలను మాత్రమే చూడటం లేదు.. తన కథలు నచ్చితేనే కమిట్ అవుతోంది. ఈ విషయంలో నయన్ మాత్రం సూపర్బ్ అనిపించుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. తమిళ్, మళయాలం, కన్నడ భాషల్లో మూవీస్ వరుసగా చేస్తోంది. తన కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు తనలాగా ఈ స్థాయిలో టాప్ ప్లేస్ లో నిలవడం తన తర్వాతే ఎవరైనా స్థానం నిలవడమే. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నాం అంటే ఇవాళ తన బర్త్ డే రోజు. ఈ పుట్టిన రోజు కూడా తన దూకుడు తగ్గడం లేదు అని చెప్పడమే. మరి నయన్ దూకుడు ఇంకో దశాబ్దం వరకు తగ్గదేమో కదా.