Ram Charan : రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం బర్త్ డే స్పెషల్ అప్డేట్

Update: 2025-03-26 12:56 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గ్లింప్స్ విడుదలైంది. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్టోన్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఓ క్రేజీ అప్డేట్ ను అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఈ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అందరి అంచనాలకు తగ్గకుండా మేకర్లు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతోన్నారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రేపు(గురువారం) ఉదయం 9 గంటల 9 నిమిషాలకు అప్డేట్ ఇవ్వబోతోన్నారు. అయితే అంత వరకు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు.

రా అండ్ రస్టిక్, రగ్డ్ లుక్‌లో రామ్ చరణ్ కనిపించబోతోన్నారు. చేతిలో చుట్ట, పొడవైన జుట్టు, గుబురు గడ్డం లుక్‌‌లో రేపు రామ్ చరణ్ దర్శనం ఇవ్వబోతోన్నారు. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్‌ను ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలానే బుచ్చిబాబు చూపించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. మాస్ పల్స్ తెలిసిన బుచ్చిబాబు రామ్ చరణ్‌ను మరింత రగ్డ్ లుక్‌లో చూపించబోతోన్నారని ఈ ప్రీ లుక్ పోస్టర్‌ను చూస్తేనే అర్థం అవుతోంది.

Tags:    

Similar News