Urmila : ఊర్మిళ విడాకులు?

Update: 2024-09-25 12:30 GMT

బాలీవుడ్ నటి ఊర్మిళ మ‌తోండ్క‌ర్ త‌న భ‌ర్త మోసిన్ అక్తార్ మిర్‌తో విడాకులు తీసుకోవాల‌ని భావిస్తున్నారట. ఈమేరకు ముంబైలోని ఓ న్యాయ‌స్థానంలో నాలుగు నెల‌ల క్రిత‌మే ఆమె విడాకుల పిటిష‌న్ వేశారని తెలుస్తోంది. అయితే ఈ విడాకులు ఆమె భ‌ర్త‌కు ఇష్టం లేద‌ని, కేవలం ఊర్మిళ‌నే న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించిన‌ట్లుగా సమాచారం. కానీ ఈ విడాకుల విషయంలో మాత్రం అటు ఊర్మిళ గానీ, ఆమె భర్త కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ముంబైలో జ‌న్మించిన ఊర్మిళ‌ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టారు. ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన రంగీలా చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ, తెలుగు, త‌మిళంలో ప‌లు చిత్రాల్లో న‌టించిన ఆమె తనకంటే 10 ఏళ్ల చిన్నవాడైన మోసిన్ ను 2016 ఫిబ్ర‌వ‌రి 4వ తేదీని పెళ్లి చేసుకుంది.

Tags:    

Similar News