Brad Pitt : ఇండియాలో సెంచరీ కొట్టిన బ్రాడ్ పిట్

Update: 2025-07-25 10:15 GMT

హాలీవుడ్ టాప్ స్టార్స్ లో బ్రాడ్ పిట్ ఒకడు. ఒకప్పుడు హ్యాండ్సమ్ హంక్ గా వాల్డ్ వైడ్ గా చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. కెరీర్ ఆరంభంలో చాక్లెట్ బాయ్ లా కనిపించినా.. తర్వాత తనూ మాస్ హీరోగా మారాడు. ఈ ట్రాన్స్ ఫర్మేషన్ కూడా చాలా టైమ్ తర్వాతే జరిగింది. అతను హీరోగా నటించిన మూవీ ‘ఎఫ్ 1’. ఫార్ములా రేస్ గేమ్ నేపథ్యంలో రూపొందిన ఈచిత్రం ఇండియాలో జూన్ 27న విడుదలైంది. జోసెఫ్ కొసిన్ స్కి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అద్బుతమైన అప్లాజ్ వచ్చింది. వాటితో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. తాజాగా ఈ మూవీ ఇండియాలో 100 కోట్ల మార్క్ ను దాటేసింది. బ్రాడ్ పిట్ ఇండియాలోనూ చాలామంది అభిమానులు ఉన్నారు. దీనికి తోడు మంచి కంటెంట్ కూడా కావడంతో కలెక్షన్స్ వచ్చాయి.

ఒక వయసైపోయిన మాజీ ఫార్ములా వన్ రేసర్ జీవితంలో జరిగిన సంఘటలను.. దాదాపు 30యేళ్ల తర్వాత తిరిగి అతను రేసింగ్ వస్తే ఈ కాలం రేసర్స్ అతన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు.. అతను ఎందుకు రేసింగ్ వదిలేయాల్సి వచ్చింది వంటి సంఘటనలతో రూపొందిన ఈ చిత్రం అటు రేసింగ్ ఎక్స్ పీరియన్స్ తో పాటు ఇటు కమర్షియల్ ఎలిమెంట్స్ తోనూ మెప్పిస్తోంది. రిలీజ్ అయి నెల రోజులు కావొస్తున్నా.. ఇండియాలో ఇంకా చాలా చోట్ల స్టడీగానే ఉండటం విశేషం. 

Tags:    

Similar News