Super Man : కలెక్షన్స్ తో షేక్ చేస్తోన్న హాలీవుడ్ మూవీస్

Update: 2025-07-21 10:03 GMT

సినిమాల సక్సెస్ రేట్ చాలా తక్కువ అని ఇప్పటి వరకూ ఎక్కువగా ఇండియన్ సినిమాల గురించే చెప్పుకున్నాం.. అయితే కొన్నాళ్లుగా హాలీవుడ్ కూడా ఈ క్రైసిస్ ఫేస్ చేస్తోంది. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ మూవీస్, పెద్ద ప్రొడక్షన్ హౌస్ లనుంచి వస్తోన్న మూవీస్ అన్నీ గ్లోబల్ మార్కెట్ లో ఢామ్మంటున్నాయి. బట్ W ఈ నెల రోజుల వ్యవధిలో విడుదలైన రెండు సినిమాలు హాలీవుడ్ కు కొత్త ఊపిరి తెచ్చాయి. అవే ఎఫ్ 1, సూపర్ మేన్ రీ బూట్. ఎఫ్ 1 హీరో బ్రాడ్ పిట్. ఫార్ములా ఒన్ రేస్ స్పోర్ట్స్ కు సంబంధించిన కథ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఈ చిత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బ్రాడ్ పిట్ నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఎఫ్ 1 అనేది అందరు ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేది కాదేమో అనుకున్నారు.. బట్ దర్శకుడు జోసెఫ్ కోసింక్సి డైరెక్షన్, ఎహ్రెన్ క్రూగర్ స్క్రీన్ ప్లే అదిరిపోయింది అనే టాక్ తెచ్చుకుంది. జూన్ 27న విడుదలైన ఎఫ్ 1 ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 460 మిలియన్ డాలర్స్ కు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి అయిన బడ్జెట్ 250 మిలియన్ డాలర్స్. విడుదలై మూడు వారాలవుతున్నా ప్రపంచ వ్యాప్తంగా ఇంకా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉంది ఫార్ములా రేస్ మూవీ. ఇండియా నుంచి ఇప్పటి వరకు 100 కోట్లు కలెక్ట్ కావడం విశేషం.

ఇక జేమ్స్ గన్ డైరెక్షన్ లో డేవిడ్ కారెన్ స్వెట్ హీరోగా నటించిన సూపర్ మేన్ సూపర్ మేన్ సైతం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. భారీ వసూళ్లు సాధిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సూపర్ మేన్ కు అద్బుతమైన అప్లాజ్ కూడా వస్తోంది. రేచల్ బ్రాస్నహాన్, నికోలాస్ హోల్ట్, ఎడి గాథెగీ ఇతర కీలక పాత్రల్లో నటించి ఈ చిత్రం ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 225 మిలియన్ డాలర్ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే 400 మిలియన్ డాలర్స్ కు పైగా వసూలు చేయడం విశేషం. మామూలుగా సూపర్ మేన్ మూవీస్ అంటే అన్ని వయసుల ఆడియన్స్ కు విపరీతంగా కనెక్ట్ అవుతుంది. అందుకే ఎఫ్ 1తో పోలిస్తే ఈ సూపర్ మేన్ కాస్త దూకుడుగా ఉన్నాడు. మొత్తంగా చాలా రోజుల తర్వాత హాలీవుడ్ కు ఈ రెండు సినిమాలూ మంచి బూస్టప్ ను ఇచ్చాయి.

Tags:    

Similar News