Brahmanandam : భీమ్లానాయక్‌లో బ్రహ్మీ.. లుక్ అదిరిందిగా..!
Brahmanandam : డైలాగులతోనే కాదు ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగల కమెడియన్ అంటే మనకి టక్కున గుర్తొచ్చే పేరు బ్రహ్మానందం..;
Brahmanandam : డైలాగులతోనే కాదు ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగల కమెడియన్ అంటే మనకి టక్కున గుర్తొచ్చే పేరు బ్రహ్మానందం.. తెలుగు తెరపై చెరగని చిరునవ్వును శాశ్వతంగా ఉంచిన కామెడి కింగ్‌లలో బ్రహ్మానందం ఒకరు. ఆయన నటించిన సినిమాలలోని కొన్ని సీన్స్ ని మీమ్స్ లాగా క్రియేట్ చేసి వాడుతున్నారంటే ఆయన ప్రేక్షకులను ఎంతలా నవ్వించారో అర్ధం చేసుకోవచ్చు.
అయితే గతకొంతకాలంగా అరకొర చిత్రాల్లో నటిస‍్తున్న బ్రహ్మానందం... తాజాగా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందంకి సంబంధించిన లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో బ్రహ్మీ పోలీసు పాత‍్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆయన కామెడీ అదిరిపోద్దని టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ డైలాగ్స్ కావడంతో బ్రహ్మీ పంచ్ లు పెలనున్నాయట.
ఇక భీమ్లా నాయక్ చిత్రం జనవరి 12, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప‍్పనుమ్ కోషీయమ్' చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం.