Brahmanandam: కృష్ణంరాజు ఇంటికి బ్రహ్మానందం.. ఓ స్పెషల్ సర్‌ప్రైజ్‌తో..
Brahmanandam: మనం ఎప్పుడూ తెరపై చూసే నటులే అయినా.. వారిలో ఇంకా మనకు తెలియని ఏదో ఒక టాలెంట్ ఉంటుంది.;
Brahmanandam (tv5news.in)
Brahmanandam: మనం ఎప్పుడూ తెరపై చూసే నటులే అయినా.. వారిలో ఇంకా మనకు తెలియని ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సమయం వచ్చేవరకు అది బయటపడదు. అలాగే మనల్ని ఎన్నో సంవత్సరాలుగా తన నటనతో నవ్విస్తూ హాస్యబ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. ఆయనలో మంచి నటుడే కాదు.. అందరినీ మెప్పించగల ఆర్టిస్ట్ కూడా ఉన్నారని లాక్‌డౌన్ సమయంలోనే అందరికీ తెలిసింది. ఆయన గీసిన బొమ్మలను ఇప్పటికీ ఎంతోమందికి బహుమానంగా అందించారు బ్రహ్మానందం. తాజాగా మరో సీనియర్ నటుడికి ఈ బహుమానం అందింది.
కృష్ణంరాజు ఇటీవల కొన్ని ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అందుకే ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అయితే ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. మునుపటితో పోలిస్తే ఆయన ఆరోగ్యం చాలా మెరుగుపడింది. ఈ సందర్భంగా కృష్ణంరాజును కలవడానికి.. బ్రహ్మానందం ఆయన ఇంటికి వెళ్లారు. కాసేపు ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి కూడా అడిగి తెలుసుకున్నారు.
అలాగే బ్రహ్మానందం.. ఆయన గీసిన ఒక బొమ్మను కృష్ణంరాజుకు బహుమతిగా అందించారు. ఈ స్పెషల్ గిఫ్ట్‌ను అందుకోవడం వల్ల కృష్ణంరాజు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 'మన కామెడీ జీనియస్.. ఆర్ట్‌లోనూ జీనియస్సే. అద్భుతమైన టాలెంట్ కలిగిన మంచి వ్యక్తి మన బ్రహ్మానందం. ఈ స్పెషల్ సర్‌ప్రైజ్‌కు థాంక్యూ' అంటూ బ్రహ్మానందంతో దిగిన ఫోటోలను ట్విట్ చేశారు.
The comedy genius is an art genius as well. Such a beautiful person with wonderful talent. Thank you for this sweet surprise. God Bless you #Brahmanandam. pic.twitter.com/MPnWkwpeAY
— U.V.Krishnam Raju (@UVKrishnamRaju) October 30, 2021