Pedro Henrique : లైవ్‌లో ప్రదర్శన ఇస్తూ బ్రెజిల్ గోస్పెల్ సింగర్ కు గుండెపోటు

డిసెంబరు 13న ప్రదర్శన సమయంలో వేదికపై కుప్పకూలి మరణించిన బ్రెజిలియన్ గాయకుడు పెడ్రో హెన్రిక్;

Update: 2023-12-15 07:52 GMT

బ్రెజిలియన్ గాయకుడు పెడ్రో హెన్రిక్ డిసెంబరు 13న ప్రదర్శన సమయంలో వేదికపై కుప్పకూలడంతో మరణించాడు. అతని వయస్సు 30. హెన్రిక్ ఫియరా డి సంతానాలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు, CNN బ్రెజిల్ ప్రకారం, వైద్యులు అతని మరణానికి కారణం గుండెపోటుగా భావిస్తున్నారు. అయితే, ఈ మరణానికి అధికారిక కారణం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. హెన్రిక్ మరణం తరువాత, అతని రికార్డ్ లేబుల్ తోడా మ్యూజిక్ ఒక ప్రకటనను విడుదల చేసింది.

బ్రెజిల్ ఈశాన్య నగరమైన ఫీరా డి శాంటాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేజ్‌పై లైవ్‌ ప్రదర్శన ఇస్తున్న సమయంలో పెడ్రో ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. దీంతో అక్కడున్న వారు అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పెడ్రో మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే అతడు మరణించినట్లు తెలిపారు. స్టేజ్‌పై సింగర్‌ కుప్పకూలిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బ్రెజిల్‌ గోస్పెల్ మ్యూజిక్‌లో రైజింగ్ స్టార్‌గా పెడ్రో పేరు సంపాదించుకున్నాడు. ఆయణ మరణవార్తతో హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ విజువల్స్ ప్రకారం.. ప్రదర్శన ఇస్తూ ఆడియన్స్‌ను కలుసుకునేందుకు స్టేజీ చివరికి వచ్చాడు. ఈ క్రమంలో బ్యాలన్స్ కోల్పోయి వెనక్కి పడిపోయి నేలను బలంగా ఢీకొట్టాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే అతడు మరణించినట్టు వైద్యులు తెలిపారు. బ్రెజిల్‌ గోస్పెల్ మ్యూజిక్‌లో రైజింగ్ స్టార్‌గా పేరుకెక్కిన హెన్రిక్ మృతి తీవ్ర విషాదం నింపింది.

Tags:    

Similar News