The Warriorr : 'ది వారియర్' నుంచి 'బుల్లెట్' సాంగ్ వచ్చేసింది..!
The Warriorr : యంగ్ రామ్, ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి జంటగా దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘ది వారియర్’;
The Warriorr : యంగ్ రామ్, ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి జంటగా దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ 'ది వారియర్'... ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
జూలై 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి 'బుల్లెట్' పాటని రిలీజ్ చేశారు.. 'కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్టు' అంటూ సాగే ఈ సాంగ్‌ను హీరో శింబుతో కలిసి హరిప్రియ పాడింది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటకి శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు.
ఈ పాటలో రామ్- కృతి డ్యాన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.