Cinema: హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘సందేహం’
సతీష్ పరమవేద ‘సందేహం’ మూవీలోని ‘చచ్చినా చావని ప్రేమిది’ సాంగ్ విడుదల
'ఊరికి ఉత్తరాన' సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న ‘సందేహం’లో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చింది. సినిమాలోని ‘చచ్చినా చావని ప్రేమిది’అనే లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రముఖ దర్శకుడు దశరథ్ చేతుల మీదుగా ఈ పాట రిలీజైంది. ఈ కార్యక్రమంలో దశరథ్‌తో పాటు మన చౌదరి, చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు. ‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్ తో వస్తోన్న ఈ సినిమాకు సత్యనారాయణ పర్చా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘చచ్చినా చావని ప్రేమిది’అనే లిరికల్ సాంగ్ విషయానికొస్తే.. ఈ పాటలో హీరో.. హీరోయిన్ పై తన ప్రేమను వ్యక్తం చేయడం చూడవచ్చు. ఆమె ఎక్కడికెళ్లినా అక్కడికి వెళ్తూ.. ఆమెపై తన అభిప్రాయాన్ని చెప్తూ, తనంటే అతనికి ఎంత ఇష్టమో చూపిస్తుండడం సినిమాపై ఇంట్రస్ట్ తెప్పించేలా ఉన్నాయి. ఇక సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తోన్న ఈ పాటను పూర్ణాచారి రాశారు. ఈ సినిమాలో గతంలో ఎప్పుడూ చూడని డిఫరెంట్ పాత్ర పోషిస్తోంది హెబ్బా పటేల్. ఆమెతో పాటు శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సురేష్ దుర్గం ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న సందేహం సినిమా ... త్వరలోనే విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సాంగ్ లాంఛింగ్ లో పాల్గొన్న డైరెక్టర్ దశరథ్..‘‘డైరెక్టర్ సతీష్ పరమదేవగారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో రానున్న ‘సందేహం’ మూవీ లిరికల్ సాంగ్‌ను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంది. పూర్ణాచారిగారు పాటను అద్భుతంగా రాశారు. పాట వింటుంటే చాలా క్యాచీగా ఉంది. నిర్మాత సత్యనారాయణగారు, హీరో సుమన్, హెబ్బా పటేల్ ఎంటైర్ టీమ్‌కు అభినందనలు’’ అని అన్నారు.
‘సందేహం’ సినిమా నుంచి రిలీజైన ‘చచ్చినా చావని ప్రేమిది’ పాట చాలా బావుందని ఈ సందర్భంగా చౌదరి చెప్పారు. ఈ సినిమా ఓపెనింగ్ నుంచి తనకు తెలుసని, ఎంటైర్ టీమ్ ఎంతో కష్టపడి అనుకున్న సమయంలో సినిమాను పూర్తి చేశారని చెప్పారు. సినిమా మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
Full View